ఎంతటి వారికైనా కూర్చుని తింటూ ఉంటే, కొండలు అయినా తరిగిపోతాయని అంటారు. అలాంటిది అప్పులు చేసి నెట్టుకుని వచ్చే వారికి, చివరకు ఆ అప్పు కూడా పుట్టని పరిస్థితి వస్తే, మొత్తం గందరగోళం అవుతుంది. అది ఒక కుటుంబం అయితే, ఏదో ఒక విధంగా బయట పడతారు, మరి అది ఒక రాష్ట్రం అయితే ? సరిగ్గా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రోజు రోజుకీ ఆర్దిక పరిస్థితి దిగజారి పోతుందని, కాగ్ లెక్కలు చెప్తున్నాయి. మరో పక్క ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అసలకే లోటుతో ప్రారంభం అయిన రాష్ట్రం, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో లక్ష కోట్లు అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం 16 నెలలుకే లక్ష కోట్ల అప్పు చేసింది. పోనీ ఆదాయం పెరిగిందా అంటే లేదు. పోనీ తెచ్చిన అప్పులతో, ఆస్తులు పోగేసి, ఆదాయం వచ్చే మార్గాలు చూస్తున్నామా అంటే అదే లేదు. అప్పు తెచ్చి, పంచి పెడుతున్నాం. ఇది రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుకు పనికి వస్తుందని కానీ, రాష్ట్ర ప్రజలకు మాత్రం, భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు.

ఆగష్టు నెల కాగ్ రిపోర్ట్ చూస్తే, ఈ ఏడాది వేసిన అప్పు అంచనా, కేవలం 5 నెలలకే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో అప్పులు ఏ స్థాయిలో ఉంటాయో చూస్తూనే భయం వేస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరం, 5 నెలలు కాలానికి, రూ.84,617.23 కోట్లు అప్పుగా రాష్ట్రం తెచ్చుకుంది. ఈ ఏడాది రూ.48,295.58 కోట్లు అప్పు తీసుకుంటాం అని అంచనా వేస్తే, 5 నెలల్లోనే అంత అప్పు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెవిన్యూ లోటు భారీగా పెరిగింది. రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది రూ.18,434.15 కోట్లు రెవిన్యూ లోటు లెక్కేస్తే, 5 నెలలకు రూ.38,199.33 కోట్ల రెవిన్యూ లోటు వచ్చింది. అంటే ఇప్పటికే రెట్టింపు అయ్యింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఒక కారణం కాగా, కరోనా కాలంలో ఆర్ధిక వ్యవస్థ మందగించటం కూడా మరో కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాష్ట్రం ఇంకా దిగజారి పోతుంది. అప్పుల కోసం, కేంద్రం షరతులకు కూడా ఏపి తలొగ్గింది. ఇలా అనేక అప్పులు చేసుకుంటూ వెళ్తే, ఆదాయం పెరగకపోతే, రాను రాను అప్పులు ఇచ్చే వారు కూడా ఉండరు. అప్పుడు పరిస్థితి మరింత దిగాజారక మానదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read