విజయవాడ వాసుల దశాబ్దాల కల కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. రెండు ప్రధాన జాతీయ రహదారాలు విజయవాడ సిటీ మీదుగా వెళ్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్ళే హైవే, కనకదుర్గమ్మ గుడి దగ్గర మలుపు ఉండటం, చాలా తక్కువ స్పేస్ ఉండటంతో, నిత్యం ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఉంటూ ఉండేవి. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫ్లై ఓవర్ కట్టటం కుదరదని తేల్చి చెప్పింది. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ ఫ్లై ఓవర్ కోసం పోరాటాలు చేసింది. చంద్రబాబు కూడా ఈ ఫ్లై ఓవర్ కోసం చేసిన మహా ధర్నాలో పాల్గున్నారు. అప్పట్లో ఈ మహా ధర్నాను అడ్డుకోవటానికి, ఇప్పుడు వైసీపీలో ఉన్న మల్లాది విష్ణు, వెల్లంపల్లి, జోగి రమేష్ అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, ఇక్కడ ఫ్లై ఓవర్ కట్టాలని, మీరు కట్టలేక పొతే, మేము అధికారంలోకి వచ్చిన తరువాత కట్టి చూపిస్తాం అన్నారు. చెప్పినట్టే, అధికారంలోకి వచ్చిన తరువాత, 2015లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గతంలో బుద్దా వెంకన్న ఈ ఉద్యమం నడిపితే, తరువాత ఎంపీ కేశినేని నాని ఈ ఫ్లై ఓవర్ కోసం కేంద్రంతో ఫాలోఅప్ అయ్యి, పనులు జరిగేలా చేసారు. అయితే నిధులు లేమి, కేంద్రం సహకరించపోవటం, డిజైన్ ల అప్రూవల్ లో జాప్యం, పుష్కరాలు, ఇలా అనేక సమస్యలతో, ఈ నిర్మాణం ఆలస్యం అయ్యింది. 2019 జూన్ నాటికి, అంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 85% నిర్మాణం పూర్తయ్యింది. అయితే తరువాత వచ్చిన వైసీపీకి, 15 శాతం పనులు పూర్తి చేయటానికి 17 నెలల సమయం పట్టింది. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ గత ప్రభుత్వం హయంలో జరిగిన కృషి పై వివరించారు. నితిన్ గడ్ఖరీ మాట్లాడుతూ, "విజయవాడ కనకదర్గ ఫ్లై ఓవర్ ఎంతో ముఖ్యమైనది. గతంలో నేను అక్కడకి వెళ్ళాను. ఆ ఫ్లై ఓవర్ నిర్మాణం దేశానికి ప్రైడ్. నాకు గుర్తుంది, గత ప్రభుత్వంలో ఇప్పటి గౌరవ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, గతంలో కేంద్ర పట్టనాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన సమక్షంలో నేను ఆ ప్రదేశానికి వెళ్లి చూసాను. నేను అప్పుడు కనకదుర్గమ్మ గుడికి వెళ్లి దర్శనం కూడా చేసుకున్నాను. నేను మొత్తం పరిశీలన చేశాను. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు అర్ధం అయ్యాయి. అప్పుడు ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగాలని, ఇది ఒక్కటే పరిష్కారం అని అర్ధం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ కోసం, విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి కూడా ఎంతో ఉంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అవటానికి, ఎప్పటికప్పుడు నాతొ ఫాలో అప్ చేసే వారు. మొత్తానికి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఫ్లై ఓవర్ విజయవాడ నగరానికి ఎంతో ఉపయోగం కానుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకున్నందుకు, సహకరించిన అందరికీ ధన్యవాదలు అంటూ", గడ్ఖరీ చెప్పుకొచ్చారు. గడ్కరీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/tGu4O_GTrgo