జగన్ మోహన్ రెడ్డి ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పైనే ఫిర్యాదు చేయటం వెనుక, ప్రజాప్రతినిధులు కేసులు ఏడాదిలో తెల్చాయలని, ఆ సుప్రీం కోర్టు న్యాయవాది ఇచ్చిన ఆదేశాల వల్లే, ఇదంతా అంటూ ప్రచారం జరుగుతున్న వేళ, అసలు ఈ కేసు వేసిన పిటీషనర్, సీనియర్ అడ్వకేట్, అలాగే బీజేపీ సీనియర్ నేత అశ్విని ఉపాధ్యాయ, జగన్ రాసిన లేఖ పై స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే విరుచుకు పడ్డారు. జగన్ రాసిన లేఖ, ప్రెస్ కాన్ఫరెన్స్ పై, అశ్విని ఉపాధ్యాయ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు. తానూ 2016లో సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ వేసాను అని, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాదిలోగా విచారణ జరగాలని, అలాగే వాళ్ళు దోషులు అని తేలితే, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అంటూ తాను వేసిన పిటీషన్ , జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చిందని, ఆయన తగు ఆదేశాలు ఇచ్చారని తన లేఖలో తెలిపారు. దీని పై స్పెషల్ కోర్టులు పెట్టి, ఏడాదిలోగా విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, అలాగే ఒక వేళ దోషులు అని తేలితే ఏమి చేయాలి అనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకులేదని, అలాగే 2017లో వేసిన మరో పిటీషన్ లో, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షడు పై ఏదైనా కేసు ఉంటే, వారిని కూడా తప్పించాలని పిటీషన్ వేశానని, అది కూడా పెండింగ్ లో ఉంది అంటూ, చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో అశ్విని ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న రాజకీయ నాయకుల పై చర్యలు తీసుకోవాలని తన పోరాటం అని అన్నారు.
అయితే ఈ క్రమంలో తను సంపాదించిన వివరాలు, వివధ పబ్లిక్ డాకుమెంట్స్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డి పై, మనీ లాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న కేసులు ఆయన పై పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఆయన పార్టీ నేతల పై కూడా అనేక క్రిమినల్, అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇవి కనుక కోర్టు లో ప్రూవ్ అయితే, ఒకేసారి అయితే 10 ఏళ్ళు, విడి విడిగా అయితే 30 ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించే కేసులు అని చీఫ్ జస్టిస్ కు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ, దాన్ని బయటకు విడుదల చేయటం చూస్తుంటే, సామాన్య ప్రజల్లో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగెట్టే విధంగా ఉందని అన్నారు. పైన చెప్పిన కేసులు పెండింగ్ లో ఉండగా, ఇలా చేస్తున్నారు అంటే, న్యాయస్థానాల పై ఒత్తిడి తేవటానికి అని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇది బెంచ్ హంటింగ్ మాత్రమే కాదని, తన పై ఉన్న కేసులు విచారణ జరగకుండా చేసే కుట్ర అని అన్నారు. ఇదేదో చిన్న తప్పు కాదని, కావాలని కుట్ర పన్ని చేసిన విషయం అని, ఫుల్ బెంచ్ సమావేశం అయి, దీని పై తగు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలి అంటే, భయపడే విధంగా చేయాలని చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో తెలిపారు.