ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు పై, సామాజికా మాధ్యమాల్లో, కొంత మంది కావాలని అభ్యంతరకర పోస్టింగులు పెట్టినా, వారి పై చర్యలు తీసుకోవాలని కోరినా, వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, హైకోర్టు రిజిస్టార్ కోర్టుకు తెలిపారు. చర్యలు తీసుకోమని కోరినా, ఎలాంటి చర్యలు లేవని అన్నారు. దీనికి సంబంధించి, హైకోర్టు రిజిస్టార్ దాఖలు చేసిన పిటీషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే తాము దాఖలు చేసిన పిటీషన్ లో స్వల్ప మార్పులు చేస్తూ, అదనపు అఫిడవిట్ వేశామని కోర్ట్ కు తెలిపారు. అయితే దీని పై కౌంటర్ సబ్మిట్ చెయ్యటానికి తమకు కొంత సమయం కావాలని, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు అంగీకారం తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, మరో అనుబంధ పిటీషన్ దాఖలు అయ్యింది. కర్నూల్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి, శివానందరెడ్డి ఈ విషయంలో మరో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున మురళీధర్‌రావు, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఆయన పిటీషన్ లో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. హైకోర్టు పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాని వెనుక కుట్ర కోణం ఉందని, దీని పై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన అనేక కీలక ఆధారాలు కోర్టుకు సమర్పించారు.

ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా, ఎలా పని చేస్తుంది కోర్టుకు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొంత మంది ప్రభుత్వంలో ఉన్నారని, వారు ఈ కుట్రలు అన్నీ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే కుట్ర కోణం ఉంది అంటూ పిటీషనర్ లేవనెత్తిన అభ్యంతరాల పై స్పందించిన ధర్మాసనం, ఆ వివరాలు అన్నీ దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచన చేసింది. అయితే పిటీషనర్ తరుపు న్యాయవాది స్పందిస్తూ, దర్యాప్తు అధికారులు నిష్పాక్షికంగా విచారణ చెయ్యటం లేదని, హైకోర్టు గతంలో 94 మందికి నోటీసులు ఇస్తే, కేవలం 12 మంది పైనే ఇప్పటి వరకు కేసు కట్టారని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు కూడా సిఐడి పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఐడి సరైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. మీరు చెప్తున్న దానికి, జరుగుతున్న దానికి పొంతన లేదని, కోర్టు పై గౌరవం ఉంటే, కనీసం ఆ అభ్యంతరకర పోస్టింగులు అయినా తొలగించాలని ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా కంపెనీలకు కూడా, ఇలాంటి కామెంట్ల పై తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read