తెలుగు రాష్ట్రాలే కాదు, భారత దేశం మొత్తం, కేసులు ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కి పడే నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో, ఏడాదిలోపు తేల్చేయాలని, అన్ని రాష్ట్రాల హైకోర్టులకి, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్ట్ ఆదేశాలు ప్రకారం, అన్ని రాష్ట్రాల హైకోర్టులు ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో రోడ్ మ్యాప్ ఇచ్చాయి. ఈ కేసు ఈ రోజు జస్టిస్ ఎన్.వి.రమణ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. అన్ని రాష్టాలు ఇచ్చిన ప్రణాళికను, అమికస్ క్యూరీ, సుప్రీం కోర్టుకు సమర్పించారు. అయితే కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన వివరాల పై, సుప్రీం అభ్యంతరం చెప్తూ, వివరాలు సంపూర్ణంగా లేవని, కొన్ని అంశాలు లేవనెత్తింది. అలాగే కేంద్రం తాను సమర్పించాల్సిన వివరాలు ఇవ్వటానికి, మరికొంత సమయం కావాలని, సుప్రీం కోర్ట్ ని కోరింది. దీంతో వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన ప్రణాళికలు తీసుకున్న సుప్రీం, ఈ కేసు తదుపరి విచారణను, రెండు వారల పాటు వాయిదా వేసింది.

అయితే ఇది ఇలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి తెలంగాణా హైకోర్టు పంపించిన వివరాలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎందుకు అంటే, తెలంగాణా సిబిఐ కోర్టులో 17 పిటీషన్ లు ఉన్నాయని, ఈ కేసులను 9 నెలల్లో తేల్చాయాలి అంటూ, తెలంగాణా హైకోర్టు, సుప్రీం కోర్టుకు ప్రణాళికలు పంపించింది. అయితే ఇక్కడ ఎందుకు ఆసక్తి అంటే, ఈ 17 కేసుల్లో, జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు 16 ఉన్నాయి. ఇదే కేసులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి, ఎంపీలు, ఉండటంతో, ఈ అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒక వేళ ఇవి రోజు వారీ విచారణకు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పై 131 కేసులు ఉంటె, తెలంగాణాలో 143 కేసులు ఉన్నాయి. ఇవన్నీ రోజు వారీ విచారణకు రానున్నాయి. ఎంత మంది ప్రజా ప్రతినిధులు ఈ కేసుల్లో దోషులుగా తెలుతారో, వారి రాజకీయ భవిష్యత్తు ఏమి అవుతుందో, కాలమే నిర్ణయిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read