ప్రతిపక్షాలు అన్నిటికీ కోర్టులకు వెళ్తున్నారని, స్పీకర్ తమ్మినేని మళ్ళీ వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు హైకోర్టులో స్పీకర్ వ్యాఖ్యల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ కు హైకోర్టు తీర్పు పై ఇష్టం లేకపోవాతే, సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చని, అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని, ఆయన అలా మాట్లాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. అయితే స్పీకర్ దీని పై నేరుగా స్పందించకపోయినా, ఆయన మళ్ళీ కోర్టు అడ్డు చెప్పటం పై వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు విద్యా కానుక కార్యక్రమంలో పాల్గున్న ఆయన, ప్రతిపక్షాలు అన్నిటికీ కోర్టుకు వెళ్లి అడ్డుపడుతున్నాయని అన్నారు. వారికి సతికోటి దండాలు అన్నారు. కోర్టుకు ఏమి చేస్తాయో, ఏమి ఒప్పుకుంటారు, ఏమి చేసికొంటారో, న్యాయస్థానాలకు విడిచి పెట్టేసమని, అది న్యాయస్థానాల ఇష్టం అని తమ్మినేని అన్నారు. అది వారికే వదిలేస్తున్నామని, దాని కోసం మాట్లాడటం లేదని తమ్మినేని అన్నారు. అయితే కోర్టులకు వెళ్లి అన్నీ ఆపేస్తున్నారని తమ్మినేని అన్నారు. నేను ఏమైనా మాట్లాడితే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని అడుగుతున్నారు, నేను ఏమి చేయ్యమంటారో వారే చెప్పాలి అంటూ, పరోక్షంగా కోర్టుల పై వ్యాఖ్యానించారు తమ్మినేని. అలాగే ఇంగ్లీష్ మీడియం, ఇళ్ళ పట్టాలు, ఉచిత విద్యుత్ పై వ్యాఖ్యలు చేసారు.

తమ్మినేని మాటల్లోనే, "ఎందుకండీ ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు ? తెలుగు మీద మనకు అభ్యంతరం లేదు. తెలుగు మన అమ్మ భాష. బిడ్డ పుట్టగానే అమ్మ అంటాడు. తెలుగు తియనైన భాష. దానికి నువ్వు గుర్తించేది ఏంటి. అది అమ్మ భాష. ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా కావాల్సింది ఇంగ్లీష్. ఈ విజ్ఞాన ప్రపంచంలో, తెలుగు వాడి జెండా ఎగరేయాలి అంటే, ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే. ఇది ఎలా తప్పు అవుతుంది ? దీన్ని కాదు అనుకుంటే, మనమే నష్టపోతాం. నా మనవడు అమెరికాలో, నా కూతురు ఇంగ్లాండ్ లో, కొడుకు రష్యాలో చదవచ్చు, నారాయణ, చైతన్యాలో చదవచ్చు, కానీ మేము చదవకూడదా ? మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చర్యలు తీసుకుంటే, కోర్టుకు వెళ్లి ఆపేసారు. మీరు ఆ పని చేయండి అని నిలదీయాలి కానీ, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఏంటి ? ఉచిత విద్యుత్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వీరిని ప్రజలే కంట్రోల్ చెయ్యాలి. ప్రజలు రిమోట్ కంట్రోల్ చేతిలోకి తీసుకుని, వారిని లైన్ లో పెట్టాలి" అంటూ తమ్మినేని వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read