ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పై ఈ మధ్య అధికార పార్టీ నేతలు కొంత మంది, తమ అసహనం వ్యక్తం చేస్తూ, మీడియాలో ఇష్టం వచ్చినట్టు హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీలు హైకోర్టు ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది అంటూ పార్లమెంట్ లో కూడా వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి, నందిగం సురేష్, గుడివాడ అమర్నాద్, పండుల రవీంద్ర బాబు, ఇలా కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హైకోర్టు ఇస్తున్న తీర్పుల పై అసహనం వ్యక్తం చెయ్యటమే కాక, హైకోర్టు పై లైన్ దాడి కూడా వ్యాఖ్యలు చేసారు. ఇదే కోవలో స్పీకర్ తమ్మినేని కూడా, హైకోర్టు పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని విషయాల పై హైకోర్టు అభ్యంతరం చెప్తుందని, ఇంకా మేము ఎందుకు , ఈ శాసన వ్యవస్థ ఎందుకు అంటూ వ్యాఖ్యలు చేసారు. తరుచు ఇలనాటి వ్యాఖ్యలు ఆయన కోర్టుల పై చేస్తూనే ఉన్నారు. అయితే స్పీకర్ స్థానంలో ఉంటూ, తమ్మినేని ఇలా వేరే వ్యవస్థ పై పౌరుషంగా వ్యాఖ్యలు చేయటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తమ్మినేని మాత్రం, తరుచూ హైకోర్టుని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, గత కొన్ని నెలలుగా, హైకోర్టు పై అధికార పార్టీ నేతలు, అలాగే అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్, సోషల్ మీడియాలో హైకోర్టు పై చేస్తున్న ప్రచారం పై, హైకోర్టు రిజిస్టార్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

హైకోర్టు రిజిస్టార్ తో పాటుగా, ఇతరులు కూడా, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పై పిటీషన్ దాఖలు చేసారు. ఇక అలాగే, 90 మందికి పైగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు ఇచ్చారు. దీని పై సిఐడి కేసు నమోదు చేసారు. అయితే ఇంత వరకూ వీరిని సిఐడి పట్టుకోలేక పోవటం పై కూడా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి నారాయాణ స్వామి, మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు పై చేసిన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. వీరి పై ఎందుకు కేసులు నమోదు చెయ్యలేదని ప్రశ్నించింది. హైకోర్ట్ రిజిస్టార్ కంప్లెయింట్ ఇచ్చినా, కేసులు నమోదు చేయరా ? ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేస్తే, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా, హైకోర్టు పై వ్యాఖ్యలు చేస్తుంటే కేసు ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించింది. వారిని రక్షించెందుకే ఇలా చేస్తున్నారా, ఇలా అయితే కేసుని సిబిఐకి ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read