ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం రాయలసీమను రత్నాలు చేస్తా, బేసిన్లు భేషీజాలు లేవు అని చెప్పిన కేసీఆర్, అలాగే రాయలసీమకు అన్యాయం జరిగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వెళ్ళేంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్నా, ఒక చిన్న ప్రాజెక్ట్ పై, ఇంత పెద్ద రచ్చ గత ఆరు నెలలుగా జరుగుతుంది. ఇద్దరూ ఒకరి దావత్ లకు ఒకరు వెళ్తారు కదా, కలిసి పరిష్కారం చేసుకోకుండా, మా మీద నిందలు ఎందుకు అని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కూడా. అయితే కేంద్రం, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం, నిన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం నడించింది. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, కేంద్ర మంత్రి స్పందించి, ఆపాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని, ఇది అక్రమ ప్రాజెక్ట్ అని, అసలకే అక్రమ ప్రాజెక్ట్ అనుకుంటే, దాన్ని మరింత విస్తరణ చేస్తాం అంటే చూస్తూ ఉండం అంటూ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జగన్ స్పందిస్తూ, మీ కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్ట్ ల కు కూడా అనుమతులు లేవు కదా అని బదులు ఇచ్చారు. అయితే కేసీఆర్ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ బేసిన్ లో భాగంగా కట్టిన ప్రాజెక్ట్ అని, దానికి అనుమతులు ఉన్నాయని, పోతిరెడ్డిపాడు బేసిన్ కు సంబంధం లేకుండా కట్టిన ప్రాజెక్ట్ అని, పోతిరెడ్డిపాడు ఆపకపోతే, అలంపూర్ వద్ద బ్యారేజీ కట్టి మేము తోడుకుపోతాం అని హెచ్చరించారు. శ్రీశైలం, సాగర్ బాధ్యత తమకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే దీనికి స్పందించిన జగన్, మీకో న్యాయం, మాకో న్యాయమా, శ్రీశైలం ఎడమగట్టు, సాగర్ కుడికాలువ మాకు ఇవ్వండి అని కోరటంతో, కేంద్రం మంత్రి కలుగ చేసుకుని, ఇరు రాష్ట్రాలను ప్రాజెక్ట్ డీపీఆర్ లు సమర్పించాలని కోరారు.