సోషల్ మీడియాలో, న్యాయమూర్తుల పై, కోర్టుల పై జరుగుతున్న దాడిలో కుట్ర కోణం ఉందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ అవ్వటానికి అవకాసం ఇవ్వాలని, పూర్తి ఆధారాలతో పిటీషన్ దాఖలు చేసారు, కర్నూల్ కు చెందిన, మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి. రాజ్యాంగ వ్యవస్థ అయిన కోర్టుల పై, ఇలాంటి దాడి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దీని వెనుక కుట్ర కోణం ఉంది అంటూ, కోర్టుకు తన పిటీషన్ లో తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వింగ్ లు పెట్టుకుని మరీ, కోర్టుల పై దాడి చేస్తున్నారని పిటీషన్ లో తెలిపారు. ఇప్పటికే హైకోర్టు రిజిస్టార్ ఫిర్యాదు చేసినా, ఎలాంటి మార్పు లేదని, రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కూడా సహకరించటం లేదని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇచ్చేందుకు అవకాసం ఇవ్వాలని కోరారు. అలాగే ఈ పిటీషన్ లో ప్రశాంత్ కిషోర్ కి సంబందించిన ఐ-ప్యాక్ అనే సంస్థ పై కూడా హైకోర్టు ముందుకు తెచ్చారు. గత ఎన్నికల్లో, వీళ్ళు వైసీపీ పార్టీకి పని చేసారని అన్నారు.
కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించి, సోషల్ మీడియాలో టార్గెట్ గా క్యంపైన్ చెయ్యటంలో వీళ్ళు సిద్ధహస్తులని అన్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, వీళ్ళు ప్రభుత్వ అజెండాను బలవతంగా స్లీపర్ సెల్స్ లాగా పని చేస్తూ, ఎక్కిస్తున్నారని, ఈ క్రమంలోనే హైకోర్టు పై దాడి కూడా, కుట్ర ప్రకారం, సోషల్ మీడియాలో చేస్తున్నారని తెలిపారు. న్యాయమూర్తుల పై దాడి చేసి, న్యాయ పాలనకు దూరం చెయ్యలనే వారి ఆలోచనలు అని అన్నారు. తమ నిర్ణయాలు ఎవరూ ప్రశ్నించకూడదు అనే ధోరణితో, ఆ ప్రతి ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ఉన్నారని అన్నారు. ఇదే కోవలో కొంత మంది వైసీపీ కార్యకర్తలకు, అలాగే ఐ-ప్యాక్ లో పని చేసిన వారికి ప్రభుత్వంలో పదవి ఇచ్చారని, వీళ్ళు ఇదే పనిలో ఉన్నారని కొన్ని ఆధారాలు సమర్పించారు. ఇక విజయసాయి రెడ్డి, మరి కొంత మంది నేతలు కోర్టుల పై చేసిన వ్యాఖ్యలను కూడా సమర్పించారు. ఇది వరకు కోర్టు 98 మందికి నోటీసులు ఇస్తే, కేవలం 18 మందిని విచారణకు పిలిచారని, అధికార పార్టీకి తలొగ్గి పని చేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం పై సిబిఐ విచారణ జరపాలని కోరారు.