ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టులు కలిసి రావటంలేదో, లేక ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే న్యాయ సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారో కానీ, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చట్ట విరుద్ధంగా, రూల్ అఫ్ లా కి వ్యతిరేకంగా ఉంటున్నాయని కోర్టులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కోర్టులు మా నిర్ణయాలు అడ్డుకుంటున్నాయి అనే ప్రచారాలు చేస్తున్నా, కింద కోర్టు నుంచి, పై కోర్టు వరకు ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాలను తప్పు బడుతున్నారు అంటే, లోపం కోర్టుల్లో కాదు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో అని గ్రహించలేక పోతున్నారు. ఉదాహరణకు కొన్ని చూస్తే, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తే ఎవరైనా చూస్తూ కూర్చుంటారా ? అందుకే కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా దీన్ని తప్పు బట్టారు. ఇక ఒక రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని తప్పించే నిర్ణయం చట్టం ఒప్పుకుంటుందా ? అందుకే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు తప్పు బట్టింది. అలాగే అమరావతి విషయం. 30 వేల మందితో అగ్రిమెంట్ చేసుకుని, ఇప్పుడు తూచ్ అంటే కుదురుతుందా ? అలాగే ఇళ్ళ పట్టాలు. ఇళ్ళ పట్టాలు మొత్తం ఆపినట్టు ప్రచారం చేసారు కానీ, నిజానికి కోర్టు ఆపింది ముంపు భూములు, మైనింగ్ భూములు, ప్రభుత్వ స్కూల్స్ స్థాలాలు లాంటివే కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ సుప్రీం కోర్టులో తగిలింది.

sc 29082020 2

ఇది కూడా ఇలాంటి నిర్ణయమే అని చెప్పాలి. ఓ కేసులో 455 రోజుల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళటం పై, సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిటీషన్ కొట్టేసిన సంఘటన ఇది. ఎప్పుడో 1999లో గుంటూరు జిల్లా, సత్తెనపల్లికి చెందిన ఎం.శ్రీనివాసరావు అనే వ్యక్తి, తమను ఒక అధికారి లంచం అడిగారు అంటూ తప్పుడు ఫిర్యాదు చేసారని ఏసిబి కేసు నమోదు చేసింది. దీనికి సవాల్ చేస్తూ, శ్రీనివాసరావు 2007లో అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. 2018లో శ్రీనివాసరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సుదీర్ఘ కాలం తరువాత, సుప్రీం కోర్టులో ఈ కేసు పై అపీల్ చేసింది. ఈ పిటీషన్ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ కు చెందిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే దీని పై సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఇంత సుదీర్ఘ కాలం తరువాత, 455 రోజుల తర్వాత ఎస్ఎల్పీ దాఖలు చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని, ఇలా చేసి సరిదిద్దలేని అసమర్థతను ప్రభుత్వం చూపించింది అంటూ, ఈ వైఖరిని తాము ఆక్షేపిస్తున్నామని సుప్రీం కోర్టు తెలియ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read