తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెంనాయడుకి, ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. దాదాపుగా 70 రోజులకు పైగా అచ్చెన్నకు బెయిల్ రాలేదు. ఈ మధ్య కాలంలోనే ఆయనకు రెండు సార్లు పైల్స్ ఆపరేషన్లు జరగటం(మొదటి సారి, పోలీసులు అరెస్ట్ చేసే ముందు రోజు ఆపరేషన్ జరిగింది), తరువాత కరోనా బారిన పడటం, ఇలా అనేక విధాలుగా ఆయన ఈ 70 రోజులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈఎస్ఐ కేసులో అచెన్న పై అభియోగాలు మోపి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదట్లో చేసిన ప్రచారం 900 కోట్లు స్కాం అంటూ హడావిడి చేసి, తరువాత 3 కోట్లు అభియోగాలు మోపి చివరకు, ఇప్పటి వరకు రూపాయి కూడా అచ్చెన్న దుర్వినియోగం చేసినట్టు నిరూపించలేదు. మరో పక్క అచ్చెన్న తరుపు న్యాయవాదులు గత 70 రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టి వేయటంతో, హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, అచ్చెన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు ఇవ్వాలని, దేశం విడిచి వెళ్ళ కూడదని, విచారణకు సహకరించాలని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్.

achem 29082020 2

ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పిటీషనర్ వేసిన బెయిల్ పిటీషన ని కింద కోర్టుతో పాటు, హైకోర్టు కూడా కొట్టేసి, మీకు దర్యాప్తు చేసే అవకాసం వచ్చేలా చేసామని, అయినా ఇప్పటి వరకు, పిటీషనర్ డబ్బు తీసుకునట్టు ఎక్కడా ఆధారాలు లేవని న్యాయమూర్తి అన్నారు. విజిలెన్స్ గతంలో చేసిన ప్రధామిక విచారణలో కానీ, ఇప్పుడు అరెస్ట్ చేసిన తరువాత రెండు నెలలుకు పైగా కానీ, పిటీషనర్ పై ఏ ఆధారం కోర్టుకు చూపించలేదు, కేవలం సిఫారసు లేఖలు మాత్రమే చూపించారు, వీటి ఆధారంగా ఇప్పటికే 77 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి, బెయిల్ ఇవ్వకుండా ఆయన స్వేఛ్చను హరిన్చాలేము, పైగా ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జెనెరల్ కూడా, ఏ విధమైన నగదు తీసుకున్నట్టు ఆధారాలు లేవని చెప్పారు, కాబట్టి ప్రాధమిక ఆధారాలు లేకుండా ఆయనకు ఇంకా బెయిల్ ఇవ్వకుండా ఉండలేం అంటూ, విచారణకు సహకరించాలని చెప్తూ, షరతులతో బెయిల్ మంజూరు చేసారు. అలాగే కేసులో ఛార్జ్ షీట్ కూడా సెప్టెంబర్ లో వేస్తున్నాం అంటున్నారు, అంటే విచారణ చివరి దశకు వచ్చినట్టే కదా అంటూ, కోర్టు వ్యాఖ్యానించింది. ఇక మరో పక్క కోర్టు ఆదేశాల పై తెలుగుదేశం శ్రేణులు సంతోషిస్తున్నాయి. అచ్చెన్న తప్పు చెయ్యలేదని ముందు నుంచి చెప్తున్నాం అని, ఇది కేవలం బీసి నేతల పై కక్ష్ సాధింపు మాత్రమే అని, ఇన్ని నెలలు గదించినా రూపాయి కూడా అవినీతి చూపించలేక పోయారని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read