వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు ఇబ్రహీంపట్నంలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. అక్రమ మైనింగ్ ను కళ్ళారా చూపించటానికి తెలుగుదేశం బృందం అక్కడకు వెళ్ళింది. తెలుగుదేశం అధికార ప్రతిన్దిహి పట్టాభిరాం నేతృత్వంలో అక్కడకు వెళ్లారు. అయితే తమ అక్రమ మైనింగ్ ను పరిశీలించి వస్తున్న టీడీపీ బృందం పై దా-డి చేసారు వైసిపీ శ్రేణులు. కొండపల్లి రిజర్వ ఫారెస్ట్ లో, గత కొంత కాలంగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటూ, వరుస కధనాలు మీడియాలో వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి, కొన్ని వీడియోలు ఫోటోలు బయట పెడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి పరిశీలనకు అక్కడకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ అధికార ప్రటింది కొమ్మారెడ్డి పట్టాభి నేతృత్వంలోని బృందం, అక్రమ మైనింగ్ పరిశీలించటానికి వెళ్లి, తిరిగి వస్తూ ఇబ్రహీంపట్నంలోని ఆల్ఫా హోటల్ లో వద్ద భోజనానికి ఆగారు. ఆ సమయంలో ఒకేసారి వచ్చి బృందం పై దా-డి చేసారు. ఈ దా-డిలో తెలుగుదేసం జెడ్పీటీసి అభ్యర్ది సజ్జా అజయ్ పై ఏడుగురు కలిసి దా-డి చేయటంతో, ఆయన తీవ్రంగా గాయ పడ్డారు. ఘటన ఫై తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
అలాగే ఈ ఘటన పై , విజయవాడ పోలీస్ కమీషనర్ కు కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయ్యనుంది. అయితే ఈ అక్రమ మైనింగ్ లో ఒక కీలక నేత ఉన్నారని, ఆ కీలక న నేత ఉండబట్టే, ఇటు పోలీసులు కానీ, అటు మైనింగ్ అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే జరుగుతున్న అక్రమాలు పరిశీలిస్తే ఇలా దా-డి చేస్తారా అని తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. తమ సమాచారం ముందే తెలుసుకుని, ఒక గ్రూప్ గా ఏర్పాడి, ఒక ప్లాన్ ప్రకారం దా-డి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు, పట్టాభి కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసారు. నేషనల్ హైవేలో, ప్రజలు అందరూ ఉన్న చోట, వచ్చిలవిడిగా ప్రవర్తిస్తూ, దా-డి చేసారని, ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అని ప్రశ్నించారు. గతంలో కూడా మార్చర్లలో ఇదే మాదిరిగా చేసారని, ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపి, తగు చర్యలు తీసుకోవలాని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు.