ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, రాజధాని అమరావతికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించే సమయంలో, ఆనాడు రాజకీయ నాయకులు అమరావతి గురించి కానీ, రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ అనేక సందర్భాల్లో, అనేక వ్యాఖ్యలు చేసారని, ఇందులో అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే రైతులు, ప్రభుత్వానికి భూములు ఇచ్చారని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మారగానే, మరో పార్టీ అధికారంలోకి రాగానే, నాడు చెప్పిన మాటలు, నాడు ఇచ్చిన నమ్మకం వమ్ము చేస్తూ, ఈ రోజు రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తాం అనే నేపధ్యంలో ఈ అన్ని అంశాలు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు, రాజధాని రైతులు. అలాగే వివధ సందర్భాల్లో, ఈ నాయకులు మాట్లాడిన మాటలు, హైకోర్టుకు సమర్పించారు. అయితే ఈ వ్యవహారం పై స్పందించిన హైకోర్టు వారందరికీ నోటీసులు జరీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి, బొత్సా, బుగ్గన సహా, తెలుగుదేశం, బీజేపీలకు కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. రైతుల పక్షాన లాయర్ ఉన్నం మురళీధర్ ఈ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చి, సమాధానం చెప్పమని కోరింది.

hc 27082020 2

రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చెయ్యాలని వీరిని ఆదేశించింది. ఇక మరో పక్క ఈ కేసుతో పాటే, ఉన్న రాజధాని కేసు పై కూడా, స్టేటస్ కో, వచ్చే నెల 21 వరకు కొనసాగిస్తూ, ఈ కేసుని వచ్చే నెల 21కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈ సందర్భంగా, ప్రభుత్వం తరుపు న్యాయావది, అనేక కేసులు ఈ విషయం పైనే వస్తున్నాయని, దీని పై ఎదో ఒక డైరక్షన్ ఇవ్వాలని కోరగా, అలా ఇవ్వటం కుదరదు అని, ఎవరినీ పిటీషన్ వెయ్యవద్దు అని చెప్పలేం అని, ఈ విషయంలో ఏదైనా జడ్జిమెంట్ వస్తే, అవి అన్ని కేసులకు వర్తిస్తుందని, ఎవరినీ పిటీషన్ వెయ్యవద్దు అని మేము చెప్పలేం అని అన్నారు. ఇక మరో పక్క రాజధాని రైతులకు ఇచ్చే కౌలు ఇవ్వటం లేదు అంటూ, వేసిన పిటీషన్ విచారణలో, ప్రభుత్వం తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ రోజు నిధులు విడుదల చేసాం అని చెప్పటంతో, ఈ కేసుని శుక్రవారానికి వాయిదా వేసారు. ఇక మరో పక్క విశాఖలోని 30 ఎకరాల్లో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ పై కూడా హైకోర్టుకు ఫిర్యాదు అందింది. ఒక పక్క స్టేటస్ కో ఉన్నా సరే, విశాఖలో గెస్ట్ హౌస్ పేరిట 30 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారని, 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్ ఉండదు అని, దీని పేరున సిఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరుగుతుందని కోర్టుకు తెలపటంతో, ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చెయ్యాలని, చీఫ్ సెక్రటరీని కోర్ట్ ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read