దేశంలోనే అతి పొడవైన కోస్తా తీరాల్లో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో పూర్తిగా చతికిలపడింది. మొత్తం 13 జిల్లాల్లో రాయలసీమ జిల్లాలు మినహా మిగిలిన 9 జిల్లాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. ఒక మేజర్ పోర్టు సహా 11 మైనర్ పోర్టులతో అలరారుతున్నప్పటికీ ఎగుమతి సన్నద్ధతా సూచీ-2020 (ఈపీఐ)లో మొత్తం 8 సముద్ర తీర రాష్ట్రాల్లో ఏపీ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్సెస్ భాగస్వామ్యంతో రూపొందించిన నివేదికను నీతి అయోగ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. సువిశాల కోస్తా తీరంతోపాటు రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నప్పటికీ ఈపీఐలో ఏపీ వెనుకబడిపోవడం వెనుక ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న వాణిజ్య రంగంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పనితీరుకు నిరాశ తప్పటం లేదు. సుదీర్ఘ తీర ప్రాంతం, నూతన సాంకేతికత, రవాణా సదుపాయాలు, అత్యాధునిక పోర్టులున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఎగుమతుల్ని ఆకర్షించటంలో సర్కారు పూర్తిగా విఫల మైంది.

niti 2908200 2

దేశంలోని వివిధ రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత, పనితీరును పరిశీలించిన నీతి అయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఎగుమతులకు సంబంధించి, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు కీలకమైన అన్ని ఆర్థిక ప్రమాణాలు, ఆర్థిక యూనిట్లను పరిగనణలోకి తీసుకుంది. ఈపీఐ పరంగా అనేక రాష్ట్రాలు ఎగుమతుల వైవిధ్యం , రవాణా అనుసంధానత, మౌలిక సదుపాయలను కల్పించడం వంటి విషయాల్లో సగటున మంచి పనితీరును ప్రదర్శించినట్లు నివేదికలో పేర్కొంది. ఎగుమతుల పోటీని తట్టుకుంటూ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఇతర కీలక అంశాలపై దృష్టిని సారించాలని సూచించింది. సముద్ర తీర రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాలు అత్యంత మెరుగైన పనితీరును కనబరచి మొదటి మూడు ర్యాకులను కైవసం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరు ర్యాకులను సాధించగా ఆంధ్రప్రదేశ్ ఏడు, పశ్చిమ బెంగాల్ ఎనిమిది ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి. సముద్ర తీరం లేకుండా చుట్టూ భూభాగమే కలిగిన రాజ స్థాన్, తెలంగాణ, హర్యానా సైతం మెరుగైన ఫలితాలను సాధించాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read