అనంతపురం జిల్లా హిందూపురంలో, ఈ రోజు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. హిందూపూర్ లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో పీపీఏ కిట్లు, ఇతర వైద్య పరికరాలు అందచేసారు. మొత్తం 55 లక్షల రూపాయల ఖరీదు చేసే పరికారాలు అందచేసారు. హిందూపురం తన గుండె చప్పుడు అని, హిందూపురం అభివృద్ధి కోసం, రాజకీయాలు పక్కన పెట్టి, ముందుకు వెళ్ళటానికి కూడా సిద్ధం అనంరు. ఇక హిందూపూర్ మెడికల్ కాలేజీ కేటాయింపు విషయమై బాలకృష్ణ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "నేను ఏది అవసరం కానిది కోరను. ప్రజలకు ఏది అవసరమో అదే కోరతాను. అవసరం అయితే పోరాడతాను. ఇవన్నీ జగన్ గారికి తెలుసు. కాబట్టి, నా నిజాయతీ గురించి అయితే ఏమి, మన హిందూపురం నియోజవర్గ ప్రత్యేకతలు అయితే ఏమి, ఇవన్నీ అందరికీ తెలుసు. హిందూపురంలో మెడికల్ కాలేజీకి అన్ని అర్హతలు ఉన్నాయి. నేను ఈ విషయం కోసం అందరితో మాట్లాడతాను. ప్రతిపక్షంలో ఉన్నానని, మన పనులు జరగకుండా నిశబ్దంగా ఉంటే కుదరదు కదా. పోరాడతాం, సాన దాన బేధ దండోపాయలు అన్నీ ఉపయోగించుకుని, ప్రజలకు సేవ చేస్తాం. నేను అడగాను అంటే, అది అవసరం అయితేనే అని వారికి కూడా తెలుసు. నా వ్యక్తిత్వం తెలుసు. అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం.
"హిందూపూర్ కి మెడికల్ కాలేజీ కోసం, నేను జగన్ గారిని అప్పాయింట్మెంట్ కూడా అడిగాను. ఆయన ఎప్పుదిస్తే అప్పుడు కలుస్తాను. ఇప్పటికే రెండు సార్లు అడిగాను. బహుసా ఈ క-రో-నా వల్ల ఇవ్వలేదమో. మళ్ళీ అప్పాయింట్మెంట్ అడుగుతాను. ఆయన ఎప్పుడు ఇస్తే, అప్పుడు ఆయన్ను కలుస్తాను." ఇక 15 నెలల పాలన పై కూడా బాలకృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. "క-రో-నా వచ్చినప్పుడు , రక ముందు అని రెండు ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి ఆగిపోయింది. కియా అనుబంధ సంస్థలు వెనక్కు వెళ్ళిపోయాయి. అభివృద్ధి కంటే కూడా, తిరిగి మళ్ళీ ఎలా రావాలా అనేది చూస్తున్నారు. కక్ష సాధింపు తప్పితే, రాష్ట్రంలో ఏమి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడినా, తెలుగుదేశం హయంలో, అభివృద్ధిలో దూసుకుపోయాం. చంద్రబాబు గారు అనుభవంతో, ఎన్నో పెట్టుబడులు తెచ్చారు. గతంలో పెట్టుబడి కోసం వచ్చిన వారు కూడా, ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది." అని బాలకృష్ణ అన్నారు.