స్వర్ణా ప్యాలెస్ లో జరిగిన ఘోర అ-గ్ని ప్ర-మా-దం-లో, 10 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతితో ఇక్కడ డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన తరువాత, అసలు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవరు ? ఎన్ఓసి ఇచ్చిన అధికారి ఎవరు ? తనిఖీలు చెయ్యల్సింది ఎవరు ? ఇలాంటి ప్రశ్నలు గురించి కాకుండా, చివరకు హోటల్ గురించి కాకుండా, బయట నుంచి వచ్చి హోటల్ లో వైద్యం అందిస్తున్న డాక్టర్ రమేష్ కులం పై, చర్చ జరిగింది. ఘటన జరిగినప్పటి నుంచి డాక్టర్ రమేష్ చుట్టూ నడిచింది. చివరకు డాక్టర్ రమేష్ ఆచూకీ చెప్తే, లక్ష రూపాయలు ఇస్తాం అనేదాకా కేసు వెళ్ళింది. అయితే తనను టార్గెట్ చెయ్యటం పై డాక్టర్ రమేష్ ఇప్పటికే జిల్లా కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఇక మరో పక్క, తన పై నమోదు అయిన ఫైఐఆర్ ని క్వాష్ చెయ్యాలి అంటూ, డాక్టర్ రమేష్ హైకోర్టులో కూడా పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా, హైకోర్టు కొన్ని ప్రాధమిక ప్రశ్నలు అడిగింది. ఇన్నాళ్ళు చర్చ జరగాల్సిన ప్రశ్నలు ఇవి కాగా, చర్చ మొత్తం కులం చుట్టూ తిరుగుతూ వచ్చింది. అయితే ఈ రోజు హైకోర్టు మాత్రం, ముందుగా అసలు ప్రాధమిక ప్రశ్నలకు సమాధానం అడిగింది. దాని పై సరైన సమాధానం రాకపోవటంతో, ఎఫ్ఐఆర్ పై ముందుకు వెళ్ళవద్దు అంటూ స్టే విధించింది.

ramesh 25082020 2

ఈ నేపధ్యంలో హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. ఘటన జరిగిన హోటల్ లో ప్రమాదానికి, అక్కడ వైద్యం అందించిన వైద్యులను ఏ ఆధారాల ప్రకారం బాధ్యులని చేసారు ? అలాగే ఈ హోటల్ ని ట్రీట్మెంట్ ఇవ్వమని అనుమతి ఇచ్చింది, ప్రభుత్వ అధికారులు కదా, అనుమతులు జరీ చెయ్యటం, పర్యవేక్షణ చెయ్యాల్సిన పని ప్రభుత్వ అధికారులది కదా ? మరి దీంట్లో ఆ అధికారులని ఎందుకు బాధ్యులుగా పరిగణించలేదు ? దీనికి అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఏంహెచ్ఓ కూడా ఈ ప్రమాదానికి బాధ్యులే కదా ? గతంలోనే ఇక్కడ ప్రభుత్వం క్వా-రం-టై-న్ సెంటర్ ను నడిపింది కదా ?అని హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా, కేసులో ఈ అధికారులని చేరుస్తారా అని ప్రభుత్వ తరుపు న్యాయవాడిని కోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మౌనంగా ఉండి పోయారు.

ramesh 25082020 3

అలాగే డాక్టర్ రమేష్ ని మీరు అరెస్ట్ చెయ్యకుండా ఉంటారా, లేక తమను ఏమైనా ఆదేశాలు ఇవ్వమంటారా అని కోర్టు, ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించగా, ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని చెప్పారు. అలాగే రమేష్ హాస్పిటల్ యాజమాన్యం, స్వర్ణా ప్యాలస్ యాజమాన్యానికి ఫైర్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటూ, రాసిన ఈమెయిల్ ని కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీంతో ప్రాధమిక ప్రశ్నలు అడుగుతూ, హైకోర్టు, అసలు దీనికి బాధ్యులు ఎవరు ? అనే దాని పై ముందు ఫిక్స్ చెయ్యండి అంటూ, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ముగ్గురు రమేష్ హాస్పిటల్ సిబ్బందిని అరెస్ట్ చేసి, జిల్లా జైలులో పెట్టారు. ఇప్పుడు హైకోర్టు అసలు ఎఫ్ఐఆర్ మీదే అనుమానాలు వ్యక్తం చెయ్యటంతో, జిల్లా కోర్టు ఆదేశాల మేరకు, వీరు కూడా విడుదల అయ్యే అవకాసం ఉంది. ముందుగా దీనికి ప్రాధమిక బాధ్యులు ఎవరు అనే దాని పై, అందరినీ బాధ్యులు చెయ్యాలని చెప్తూ, ఇప్పుడు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read