కృష్ణాజిల్లా గన్నవరం నియోజిక్వర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వంశీ వైసీపీలోకి అధికారికంగా చేరకపోయినా, వైసిపీలనే ఉంటున్నారు. ఉప ఎన్నిక వస్తే ఇక్కడ వైసిపీ టికెట్ నాకే అని ప్రకటించుకున్నారు కూడా. అంతే కాదు, ఇక్కడ ఇంచార్జ్ కూడా నేనే అని రెండు రోజుల క్రిందట ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇక్కడ వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, అలాగే రెండోది మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్. అయితే వీరిని కాదని వంశీ చేస్తున్న హడావిడితో అనూహ్య పరిణామాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే నిన్న సీనియర్ నేత దుట్టా ఓపెన్ అవ్వటంతో, ఈ విషయం రచ్చకు ఎక్కింది. మొట్టమొదటి నుంచి కూడా వైసిపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి దుట్టా, నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీ తీరు పై ఆయన పూర్తీ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసారు. వల్లభనేని వంశీ గురించి ప్రత్యక్షంగా ఆయన బహిరంగంగా మాట్లాడుకోవటం జరిగింది. మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నేను వస్తాను అంటూనే, 15 రోజుల్లోనే మీరు ఒక శుభవార్త వింటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

dutta 24082020 2

ఈ సంచలన వార్తా ఏమిటా అని ఇప్పుడు గన్నవరంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల కాలంలో, వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, జరిగిన కార్యక్రమంలో దుట్టా వార్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి, వంశీ వర్గీయులు చేసిన హడావిడి పట్ల ఆయన పూర్తీగా అసంతృప్తి చెందారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులుని, కార్యకర్తలని, వంశీ వ్యవహరిస్తున్నారు అనే తీరులో ఆయన మాట్లాడారు. దుట్టా రామంచంద్రరావు ఈ విషయం పై మీడియాతో కూడా మాట్లడారు. ఆయన మాట్లాడుతూ " వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరంలో గత 10 ఏళ్ళ నుంచి జెండా మోస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీలో కష్టపడిన వారిని పక్కన పెట్టి, నిన్నా మొన్న వచ్చిన వారికి, నీ వెనకాల ఉండే భజన పరులని పార్టీ ముందు పెట్టి, గన్నవరంలో పార్టీని నడుపుతాం అంటే మేము అంగీకరించం. గతంలో మా పై కేసులు పెట్టిన వాళ్ళని, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వారికి, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. మేము అడిగినా ఇవ్వలేదు. ఎమ్మెల్యే చేస్తున్నాడు ఇదంతా."

dutta 24082020 3

"మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా ? కచ్చితంగా దీన్ని ఎదుర్కుంటాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నా అల్లుడు నుంచుటారు అంటున్నారు. అవును టికెట్ ఇస్తే, నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేది. 15 రోజుల్లో మా కార్యకర్తలకు ఒక మంచి వార్త చెప్తాను."అని దుట్టా అన్నారు. మొత్తం మీద రెండు వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. వైసిపీలోకి వంశీ వెళ్ళటంతో మొదటిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను యార్లగడ్డ గమనిస్తున్నారు. ఆయన ఈ గొడవ పై ఇప్పటి వరకు స్పందించలేదు. మరో పక్క దుట్టా వర్గం, యార్లగడ్డను కలుపుకుని వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. దుట్టా రామచంద్రరావు వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అలాగే దుట్టా అల్లుడు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయనకు జగన్ భార్య భారతితో బంధుత్వం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు వంశీ తరువాత స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీకి వ్యతిరేకంగా ఉండటం, మరో పక్క రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వంశీని ఎలా అయినా ఓడించాలని తెలుగుదేశం పట్టుదలగా ఉండటంతో, అన్ని వైపుల నుంచి వంశీకి ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మరి ఇది ఎలా దాటుకుని ముందుకు వెళ్తారో, జగన్ ఇది ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read