ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి స్పెషల్ స్టేటస్. టాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ హామీ ఏడు ఏళ్ళు అయినా అమలు కాలేదు. అనేక విభజన చట్టంలో ఉన్న అంశాలు లాగానే, ఇది పెండింగ్ లోనే ఉంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఇది రాజకీయ అంశంగా కూడా మారింది. అప్పట్లో ప్రతిపక్షాలు ఈ విషయం పై, తెలుగుదేశం, బీజేపీ పార్టీలను రాజకీయంగా కార్నర్ చేస్తూ వచ్చేవి. మిత్రపక్షంగా ఉంటూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తెలుగుదేశం పార్టీకి, స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యయనం అని, కేంద్రం నుంచి సమాధానం రావటంతో, షాక్ తిన్నారు. అయితే అప్పటికీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని, స్పెషల్ స్టేటస్ ఇస్తామని, హోదాలో ఉన్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయని, కేంద్రం ప్రకటన చేసింది. హోదా ఎలాగూ ఇవ్వటం లేదు కాబట్టి, ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఒప్పుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా, ఇది కూడా అమలు కాకపోవటంతో, మాకు ఇవన్నీ వద్దు, హోదానే ఇవ్వండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయంగా దెబ్బతిన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీజేపీని నమ్మినందుకు, చంద్రబాబు రాజకీయంగా దెబ్బ తిన్నారు. అటు రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. అయితే ఈ అంశాన్ని మాత్రం, వైసీపీ రాజకీయంగా వాడుకుంది. హోదానే ఎన్నికల అజెండా చేసారు జగన్ మోహన్ రెడ్డి. దానికి తగ్గాటే, హోదా సాధిస్తారని, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు ప్రజలు.

అయితే ఎన్నికలు గెలవటం మొదలు, హోదా విషయం అటకెక్కింది. కేంద్రం మెడలు వంచలేం అని, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప ఏమి చేయలేమని జగన్ చెప్పేశారు. ఇలా 16 నెలలు గడిచిపోయాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో రాజకీయం మారింది. బీజేపీకి మిత్రపక్షాలు దూరం అవుతున్నాయి. అధికారంలో ఉండి కూడా ఇలా జరుగుతూ ఉండటంతో, ఇప్పుడు కేంద్రం కొత్త మిత్రుల కోసం వెతుకుతుందని, అందుకే జగన్ మోహన్ రెడ్డిని రెండు సార్లు ఢిల్లీ పిలిచారని, వైసీపీని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని, మంత్రి పదవులు ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో హోదా విషయంలో క్లారిటీ లేకుండా, మంత్రివర్గంలో చేరితే రాజకీయంగా నష్టపోతాం అని జగన్ చెప్పటంతో, కేంద్ర పెద్దలు మళ్ళీ స్పెషల్ ప్యాకేజి విషయం తెర పైకి తెచ్చారని, ఇది వరకు ఇచ్చిన ప్యాకేజి కంటే మెరుగైన ప్యాకేజి ఇస్తామని, హోదా కంటే లాభం అని చెప్పినట్టు తెలుస్తుంది. ఒకసారి బీజేపీ ఫిక్స్ అయితే, జగన్ కు ఆప్షన్ ఉండదు కాబట్టి, ఆయన ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే హోదా పోయి, మళ్ళీ ప్యాకేజి వచ్చినా, అది ఎంత వరకు కేంద్రం ఇస్తుంది, ఎంత వరకు రాష్ట్రానికి లాభం, ఇవన్నీ చర్చకు వస్తాయి. మరి జరుగుతున్న ప్రచారం నిజమేనా ? స్పెషల్ ప్యాకేజి ఇస్తున్నారా ? జగన్ పార్టీ కేంద్ర క్యాబినెట్ లో చేరుతుందా ? చూడాలి ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read