జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు న్యాయముర్టులలో ఒకరైన జస్టిస్ ఎన్వీ రమణ పై ఆరోపణలు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బాబ్డే కు రాసిన లేఖ పై ఢిల్లీ బార్ అసోసియేషన్, అత్యంత ఖటినమైన, తీవ్రమైన పదజాలంతో ఖండించింది. జగన్ ఇటువంటి దుశ్చర్యలు మానుకోవాలని చెప్పింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ పై ఆయన బురద చల్లే ప్రయత్నం చేసారని, ఇటువంటి చర్యలు వల్ల న్యాయ వ్యవస్థకు ఎటువంటి మచ్చ రాదు కనీ, ఈ చర్యల వల్ల న్యాయ వ్యవస్థ పై జగన్ చేస్తున్న చర్యల పై మాత్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ రోజు ఢిల్లీ బార్ అసోసియేషన్ జరిపిన సమావేశంలో, ఒక తీర్మానాన్ని కూడా ఆరోపించారు. ఆ తీర్మానంలో అత్యంతకఠినమైన వ్యాఖ్యలు జగన్ పై వాడారు. ఏదైతే న్యాయ వ్యవస్థ పై నికృస్టంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని, ఇలాంటి పనులు ఆయన మానుకోవాల్సి ఉందని, అతని చర్యల పై అందరు ఖండించాలని చెప్పారు. అలాగే జస్టిస్ ఎన్వీ రమణ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలుసు అని, ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా చేసారని, ఆయన నిబద్ధత ఏమిటో మాకు తెలుసని అన్నారు. అత్యుత్తమ న్యాయమూర్తులు కలిగిన వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణకు పేరు ఉందని అన్నారు.
ఆయన పై ఆరోపణను ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నామని ఈ లేఖలో రాసారు. అంతే కాకుండా, జగన చర్యలు, స్వచ్చంద న్యాయ వ్యవస్థ పై దాడి జరపటమే అని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇలాంటి న్యాయ వ్యవస్థను బెదిరించటానికి, జగన్ చేస్తున్న పనులను మేము ఖండిస్తున్నామని, న్యాయమూర్తుల పై జగన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి హేతు బద్ధత లేదని, ఈ లేఖలో తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 6 న లేఖ రాసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందిన ప్రతినిధి అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం పెట్టి చెప్పటం, ఆ లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేయటం, వీటి అన్నిటి పై , ఢిల్లీ బార్ అసోసియేషన్ ఖండించింది. ఈ లేఖ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కాబట్టి జగన్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్ భావించింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని, మొత్తం వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని తమ తీర్మానంలో తెలిపారు.