ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రెస్ మీట్ పెట్టి, సుప్రీం కోర్టు జస్టిస్, హైకోర్టు జస్టిస్ ల పై, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను మేఇద్య సమావేశంలో బహిర్గతం చేయటం పై, సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు అయ్యింది. ముక్తి సింగ్ అనే న్యాయవాది, తన క్లైంట్ సునీల్ కుమార్ సింగ్ తరుపున ఈ పిటీషన్ దాఖలు చేసారు. భవిష్యత్తులో జడ్జిలను కించపరుస్తూ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే జగన్ మోహన్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఎందుకు చర్యలు తీసుకోకూడదో అడగాలని తన పిటీషన్ లో కోరారు. ఆ ప్రెస్ మీట్ తో పాటు, మీడియాకు విడుదల చేసిన అంశాలు అన్నీ, గౌరవ సుప్రీం కోర్టు జస్టిస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా, కావాలని చేసినట్టు ఉందని తన పిటీషన్ లో తెల్పారు. సుప్రీం కోర్టు జస్టిస్ పై, అలాగే హైకోర్టు జస్టిస్ ల పై, చేసినవి అన్నీ నిరాధార ఆరోపణలు అని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న పరిధి దాటి, జగన్ మోహన్ రెడ్డి స్పందించారని కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీలలో కానీ, ఏ సుప్రీం కోర్టు జడ్జి గురించి కానీ, ఏ హైకోర్టు జడ్జి చేసే డ్యూటీ గురించి మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఉందనే విషయం గుర్తించుకోవాలని పిటీషన్ లో తెలిపారు.
ఈ ఇంటర్నెట్ యోగంలో, సోషల్ మీడియా బాగా ఆక్టివ్ గా ఉన్న సమయంలో, ఇలాంటి నిరాధార ఆరోపణలు, నిమిషాల్లో వైరల్ అవుతాయి అని, ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మోకం కోల్పోయే అవకాసం ఉందని పిటీషన్ లో తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేస్తారని, ఆ ప్రమాణం ప్రకారం, రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో దేశ న్యాయవ్యవస్థ పై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే, పౌర సమాజనికి, న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోయే అవకాసం ఉంటుందని తన పిటీషన్ లో తెలిపారు. ఈ కేసు సుప్రీం కోర్టు విచారణకు తీసుకుంటుందా ? తీసుకుంటే ఎప్పుడు విచారణకు వస్తుంది ? సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకు ఈ కేసు వస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుంది ? ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనే దాని పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. చూద్దాం ఏమి అవుతుందో.