విశాఖ ఏజెన్సీ గిరిజనులను వింతవ్యాధి వట్టిపీడిస్తోంది. ఒక్కసారిగా జ్వరం రావడంతోపాటు శరీరమంతా పట్టు వదిలేసినట్టు అయి కుప్పకూలిపోతున్నారు. స్థానిక పీ హెచ్ సీలకు వెళితే, వారు ఇచ్చిన మందులకు జ్వరం తగ్గక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు వడుతున్నారు. వ్యాధి తీవ్ర పెరగడంతో పలువురిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కో-వి-డ్ మహమ్మారి విశాఖ ఏజెన్సీలో విస్తృతంగా వ్యాపిస్తుండగా మరోవైపు వింత వ్యాధితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఏజెన్సీలో ఎక్కువగా మలేరియా వ్యాధి ప్రబలడం జరిగేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా వ్యాధి ఏమిటో అన్నది తెలియకుండా గిరిజనులు మంచాన పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి పంచాయతీ కరకవలస, చినరాభ గ్రామాల్లో మూడు వారాల వ్యవధిలో పదుల సంఖ్యలో గిరిజనులు మంచాన పడ్డారు. వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జ ్వరం, కడుపునొప్పితో పాటు కాళ్లు చేతులు విపరీతంగా వావులు వచ్చి అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఏడీఎంపావో ఏజెన్సీ గ్రామాలకు చేరుకుని వింతవ్యాధికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. జ్వరంతోపాటు కాళ్లు, చేతులు వాపులు, అంతేకాదు అనారోగ్యం బారిన పడిన కరకవలస, తట్టుకోలేని కడుపునొప్పి వస్తుండటంతో అసలు సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో, 18మంది గిరిజనులను గజపతినగరానికి తరలించి ఏర్పడ్డాయి. విశాఖ ఏజెన్సీలో మారుమూల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ కోవిడ్ గ్రామాలు ఎక్కువగా వున్నాయి. వారికి నెగేటివ్ వచ్చింది. అయినప్పటికీ విశాఖ ఆసుపత్రులు అందనంత దూరంగా వుండటంతో కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, కడుపునొప్పి, కాళ్లు, చేతులు వాపు రావడం వంటి లక్షణాలతో విశాఖ కేజీ హెచ్ లో గిరిజనులు చికిత్స పొందుతున ఇప్పటికీ ఈ వ్యాధి ఏమిటో అన్నది ఇంకా వైద్యులు నిర్ధారించుకోలేకపోతున్నారు. పేడ పురుగు కుట్టినా ఇదే తరహాలో జ్వరం వచ్చి శరీరం వట్టువదిలేసే వరిస్థితులు ఏర్పడతాయని పలువురు చెబుతుండగా మరోవైపు అటువంటిదేమి లేదని మరో వాదన వినిపిస్తోంది. పేడ పురుగు కుడితే శరీరంపై ఎరుపురంగు మచ్చలు ఏర్పడతాయన్న వాదన కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలో గిరిజనులు విచిత్రమైన లక్షణాలతో మంచానపడి సతమతమవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పరిస్తితి చెయ్యి దాటిపోయే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read