ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు హైకోర్టులో , బిల్డ్ ఏపి పిటీషన్ పై వాదనలు జరిగాయి.. ఈ సందర్భంగా హైకోర్టు ఇరు పక్షాల వాదనలు వింది. పూర్తీ ష్టాయి విచారణ చేస్తాం అని ఈ కేసుని అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న భూములు అమ్మి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాలని బిల్డ్ ఏపి అనే కార్యక్రమం మొదలు పెట్టింది. ముఖ్యంగా వైజాగ్, గుంటూరులో ఉన్న ఆస్తుల విక్రయాల పై గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు, హైకోర్టులో పుబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు. దీంతో పాటు పలు పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా విచరణ చేసిన కోర్టు, ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ శాఖల కార్యదర్శులకి, నోటీసులు ఇస్తూ, అక్టోబర్ 6 లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఈ బిల్డ్ ఏపి పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, భూములు విక్రయం చేయటానికి వీలు లేదని చెప్పింది.

అయితే ఈ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డు పడుతున్నారని, వారిని పరిపాలన కూడా చేసుకోమనండి అంటూ, చేసిన వ్యాఖ్యల పై హైకోర్టు సీరియస్ అయ్యింది. మీ ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు అని గట్టిగా అడిగింది. హైకోర్టు ని అంటున్నారా ? లేక పిటీషన్ వేసిన వారినా అంటూ, వ్యాఖ్యలు చేసిన కోర్టు, రాజకీయ ఆరోపణలుకి హైకోర్టు వేదిక కాదని, అదనపు అడ్వకేట్ జనరల్ కు , హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పష్టం చేసారు. విచారణ పూర్తయిన తరువాతే తీర్పు ఇస్తామని చెప్పారు. అయితే గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కోర్టులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు పార్లమెంట్ లో, ఇటు రాజ్యసభలో కూడా కోర్టులు ఇస్తున్న తీర్పుల పై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కోర్టులోనే ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read