ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి, పోలీసు శాఖ పై హైకోర్టు ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సహజంగా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తే, అవి రాజకీయంగా కొట్టి పారేస్తాం కానీ, తమ దృష్టికి వచ్చిన అంశాల పై హైకోర్టు అనేక పర్యాయాలు ఏపి పోలీసుల పై ఫైర్ అయ్యింది. ముఖ్యంగా డీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పోయిన వారం సిఐడి తీరు పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిఐడి అంటే నేరాలు జరగకుండా ఉండాలని, అంతే కానీ అధికార పక్షాన్ని సంతోష పెట్టటానికి కాదు అంటూ, తెలుగు వన్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఏపి సిఐడి వార్తల్లోకి ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పాధ్యక్షుడు డాక్టర్‌ గంగాధర్‌, కరోనలో వైద్యులు కష్టాలు వివరిస్తూ వ్యాఖ్యలు చేసారు. వైద్యులకు ప్రభుత్వం సరైన రక్షణ పరికరాలు ఇవ్వటం లేదని, పీపీఈ కిట్లు ఇవ్వటం లేదని, ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. అయితే దీని పై ఆయనకు ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది.

ఆయన విచారణకు కూడా హాజరు అయ్యారు. అయితే దీని పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. సమస్యలు ఎత్తి చూపిస్తే కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని వ్యాఖ్యానించారు. అంతే కాదు, దీని పై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. లేఖ ద్వారా ఆయన జరిగిన విషయం మొత్తం చెప్తూ, రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ లేదని, స్వేఛ్చ లేదని, పోలీసులు జీవించే హక్కుని కూడా హరిస్తున్నారు అంటూ, ఫిర్యాదు చేసారు. దీని పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందిస్తూ, ఆయన లేఖను ఫిర్యాదుగా తెసుకుని, కేసు నమోదు చేసింది. దీని పై త్వరలోనే విచారణ జరగనుంది. ఇదే అంశం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీని పై లీగల్‌ అథారిటీ ఆంధ్ర రత్న భవన్ కు వచ్చి, ఆ లేఖకు సంబంధించి సమాచారం తీసుకుని వెళ్లారు. మరి హైకోర్టు దీని పై స్పందిస్తుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read