వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒకప్పటి నెంబర్ 2, రాజ్యసభ సభ్యడు అయిన విజయసాయి రెడ్డికి, ఊరట లభించింది. ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద లాభాదయాక పదవిలో ఉన్నారని, ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, మరో పదవిలో ఉండటం, రాజ్యాంగానికి విరుద్ధం అని, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని తొలగించి, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేత రామకోటయ్య, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి గతంలో ఫిర్యాదు చేసారు. పిటీషన్ ను పరిగణించి, వాస్తవాలు చూసి, విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలని కోరారు. విజయసాయి రెడ్డి ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, ఆయన్ను ఏపి ప్రభుత్వం మరో పదవిలో పెట్టిందని అన్నారు. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని, ఆయనకు ఆ పదవి లాభదాయకమైన పదవి అంటూ, ఫిర్యాదు చేసారు. ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, మరో పదవి కలిగి ఉండటం పై రామకోటయ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆయన లాభదాయక పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి అనర్ధత వెయ్యాలని రాష్ట్రపతిని కోరారు. అయితే ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, దీని పై కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం చెప్పమని కోరింది.

vs reddy 07092020 2

ఆ ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫార్వడ్ చేసింది, రాష్ట్రపతి కార్యాలయం. అయితే దీని పై విచారణ చేసిన ఎన్నికల కమిషన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడితో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యెక ప్రతినిధిగా ఢిల్లీలో, క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్నారని, అయితే ఈ పదవి లాభదాయక పదవి కాదని, ఆయన ఈ పదవి కోసం ఎలాంటి జీతం తీసుకోవటం లేదని, ఇది ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కిందకు రాదని, ఎలక్షన్ కమిషన్ తేల్చింది. ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ అనేది, ఈ పిటీషన్ కు వర్తించదని, రాష్ట్రపతికి విన్నవించింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, విజయసాయి రెడ్డి అనర్హత పిటీషన్ ను, రాష్ట్రపతి కొట్టేసారు. దీంతో విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. అయితే ఆయనను ముందుగా ప్రత్యెక ప్రతినిధిగా నియమించినప్పుడు, ఈ పదవి లాభదాయక పదవిలోనే ఉంది. ప్రతిపక్షాలు గొడవ చేయటంతో, వెంటనే ఆ నియామకం రద్దు చేసి, ప్రత్యెక ప్రతినిధి పదవిని, లాభదాయక పదవి నుంచి మినహాయింపు ఇచ్చి, మళ్ళీ విజయసాయి రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read