ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చేరే వారి కంటే, సస్పెండ్ చేసే వాళ్ళ లిస్టు ఎక్కువ అయిపొయింది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తరువాత, ఒక వర్గాన్ని చూసి మరీ దెబ్బ కొడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా గత అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారయణకు అనుకూలంగా ఉండేవారిని, రాష్ట్ర కమిటీలో ప్రాధన్యత ఇవ్వకపోవటంతో పాటుగా, వారిని టార్గెట్ చేసి పంపించేస్తున్నారు కూడా. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ హవా నడుస్తుందనే భావన కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో బీజేపీ నాయకుడు లంకా దినకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సోము వీర్రాజు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం అందరికీ షాక్ కలిగించింది కూడా. ఎందుకంటే లంకా దినకర్ మంచి సబ్జెక్ట్ తో, వాగ్ధాటితో టీవీ చానల్స్ లో, చర్చల్లో తమ పార్టీ వాణి వినిపిస్తూ ఉంటారు. నేషనల్ మీడియాలో కూడా ఆయన పార్టీ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడో జరిగిన దానికి, ఇప్పుడు దినకర్ ను సస్పెండ్ చేయటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై కొన్ని టీవీ చానల్స్ తో దినకర్ మాట్లాడారు. తన సస్పెన్షన్ ను వెనక్కు తీసుకుంటారనే నమ్మకం ఉందని దినకర్ తెలిపారు. నేను ఏ తప్పు చేయలేదని, ఈ విషయమే గతంలో పార్టీకు వివరణ కూడా ఇచ్చానని అన్నారు. తాజాగా బెంగుళూరులో పార్టీ వర్క్ షాప్ కి కూడా, ఏపి తరుపున రిప్రజెంట్ చేసానని గుర్తు చేసారు. బీజేపీ పార్టీ సిద్ధాంతంలు, రాష్ట్ర, దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే తాను చర్చల్లో పాల్గుంటానని, ఎప్పుడు తప్పు చేయలేదని అన్నారు. అయితే జూలై 26న ఒక ప్రాముఖ ఛానల్ డిబేట్ లో లంకా దినకర్ పాల్గున్నారు. అయితే అప్పటికే అమరావతి పై ఎలాంటి డిబేట్ లకు వెళ్ళవద్దని పార్టీ ఆదేశించింది.

అయితే సదరు ఛానల్ ముందుగా ఈ డిబేట్ నిమ్మగడ్డ విషయం పై అని చెప్పి, చివరి నిమిషంలో టాపిక్ మార్చారని, ఇదే విషయం తానూ రైజ్ చేస్తే, యాంకర్ క్షమాపణ చెప్పారని, ఇదే విషయాన్ని తాను ఆ రోజే అప్పటి అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు చెప్పిన విషయన్ని గుర్తు చేసారు. తాను రెండు నెలల నుంచి ఏ టీవీ ఛానల్ డిబేట్ లో పల్గునలేదని చెప్పారు. ఇటీవలే దినకర్ కు కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితిలో, ఎప్పుడో జరిగిన దాన్ని, ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయం పై, దినకర్ ను సస్పెండ్ చేయటం పై, పార్టీలో అతని పై కుట్ర జరిగిందని, కొంత మంది కావాలనే అతన్ని తప్పించేలా వార్తలు మోసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇక నుంచి ఎవరైనా టీవీ చర్చలకు వెళ్ళాలి అంటే, ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలని సర్కులర్ విడుదల అయ్యిందని, సాయంత్రానికి రాత్రికి దినకర్ ను సస్పెండ్ చేసారని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం బీజేపీ అంతర్గత వ్యవహారం కావటంతో ఇతర పార్టీలు స్పందించలేదు. దినకర్ మాత్రం, తన సస్పెన్షన్ రద్దు చేస్తారని, తన వివరణ మళ్ళీ ఇస్తాననే ధీమాలో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read