విపత్తులు అనేవి సర్వ సహజం. ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా అది తప్పదు. కానీ ఆ విపత్తులు చూసి నవ్వితే, ఏదో ఒక రోజు మనకీ అదే పరిస్థితి వస్తుందని గ్రహించాలి. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరీ ముఖ్యంగా అమరావతి వాసులు. కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యి 7 ఏళ్ళు అవుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ చిన్న వర్షం పడినా, పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాంటిది రెండు మూడు రోజులు వర్షం అయితే చెప్పే పనే లేదు. ఇప్పుడు హైదరాబాద్ అదే పరిస్థతి ఎదుర్కుంటుంది. విశ్వనగరం కాస్త, విశ్వ నరకం అయ్యింది. చాలా కాలనీలు వారం రోజులకు పైగా వరదలోనే ఉన్నాయి. సరిగ్గా నీటి పారుదల లేక, ఈ పరిస్థితి. ప్రతి ఏడు ఇదే పరిస్థితి. కాకపొతే ఈ ఏడాది మరి కొంచెం ఎక్కువ. సాటి తెలుగు రాష్ట్రం, అందులో ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలకు హైదరాబాద్ తో అనుభంధం ఉంటుంది కాబట్టి, ఈ పరిణామాలు బాధ వేస్తున్నాయి. హైదరాబాద్ త్వరగా కోలుకోవలాని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే కేసీఆర్, కేటీఆర్ గేలి చేసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైజాగ్ కి హుద్ హూద్ వచ్చిన సమయంలో, కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి లేదని, ఐటి కంపెనీలకు ఇక్కడే సేఫ్టీ అని ఒక ప్రకటన చేసారు. ఇక కేసీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ రాష్ట్రము అని, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ హేళన చేసిన మాటలు ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద వరద వచ్చినా అమరావతి మునగలేదని, గుర్తు చేసుకుంటూ, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఒక ప్రాంతాన్ని తక్కవ చేసి మాట్లాడాలని, లేకపోతే, కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోతుందని గుర్తు చేస్తున్నారు.
గతంలో కేసీఆర్, కేటీఆర్, ఏపి పై మాట్లాడిన మాటలు వైరల్...
Advertisements