వైసీపీ అధికారంలో ఉంది. అధినేత వై నాట్ 175 అంటున్నారు. అయితే నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. సిట్టింగులు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం సీటిచ్చినా పోటీ చేయలేం అంటున్నారు. కారణం ఏంటని బయటపెట్టకపోయినా, వైసీపీ దారుణ పరాజయం ఖాయమని తేలిపోయిందని, పోటీచేస్తే సంపాదించుకున్నదాంతోపాటు అప్పులు చేసి పెట్టినదీ పోతుందనే భావనలో వైసీపీ సీనియర్లున్నారట. ఈ విషయం బయటకు చెబితే అధినేత జగన్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటో ఆనం రాంనారాయణరెడ్డి ప్రత్యక్షంగా చూశారు. అందుకని జగన్ విచిత్ర మనస్తత్వం ఎరిగిన నేతలుగా సిట్టింగులు, మాజీ మంత్రులు తమ వారసుల కోసం పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతున్నారు. వారసులు పోరు పడలేక వారికే సీట్లు ఇవ్వాలని అడగడం ద్వారా ..ఇటు వారసుల ఆశ నెరవేర్చవచ్చని, ఓటమికి కారకులయ్యామనే అపవాడు దూరం చేసుకోవచ్చని, సంపాదించుకున్నది మిగులుతుందనే దూరాలోచనతో కొందరు వైసీపీ నేతలు ఉన్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, పేర్ని నాని, చెరుకువాడ రంగనాథరాజు వంటి వారు సీటుని వారసుల కోసం త్యాగం చేస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఓటమి భయమే వీరిని వెన్నాడుతోందని వారి అనుయాయులు చెబుతున్న వాస్తవం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వంటివారు ప్రతిపక్షం కంటే స్వపక్షం నుంచి ఎదురవుతున్న దాడులని తట్టుకోలేక ఏకంగా పోటీకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మొత్తానికి వైసీపీలో చాలా మంది మంత్రులుగా పనిచేసినవాళ్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి తప్పని ఎన్నికల్లో పోటీచేసి ఏం ప్రయోజనం అని ఆలోచించి ఏదో ఒక సాకుతో పోటీకి దూరం అయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట.
ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు సీటిచ్చినా పోటీ చేయమంటున్నారు.. లిస్టు పెద్దదే...
Advertisements