ఏపీలో రౌడీల కంటే ఘోరంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. కేంద్ర హోంశాఖ డిజి స్థాయి అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకున్నా, అదురూ బెదురూ లేని పోలీసులు చెలరేగిపోతున్నారు. వీరిని పోలీసులు అనే కంటే గూండాలు అని పిలవడం కరెక్ట్ అంటున్నారు టిడిపి నేతలు. కదిరిలో సీఐ తమ్మిశెట్టి మధు మీసం మెలేస్తూ, ప్రజలపై చాలెంజ్‌లు విసురుతూ, వైసీపీ నేతలతో కలిసి దాడులకు తెగబడడం చూస్తుంటే దీని వెనక ఏదో ప్రయోజనం ఉందని అనుమానాలు వస్తున్నాయి. అయితే గత టిడిపి ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే మీసాలు తిప్పుతూ, రోడ్లపైనే ప్రజలపై దాడులు చేస్తూ, చివరికి వైసీపీ ఎంపీ టికెట్ సాధించి ఎంపీ అయిపోయాడు. ఇప్పుడు ఏపీలో పోలీసులు చాలా మంది గోరంట్ల మాధవ్లాగే అధికార వైసీపీ మెప్పు పొంది, వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించి ఎంపీ అయిపోవచ్చనే దురాశతో ఇంతలా బరితెగిస్తున్నారని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. గన్నవరం సీఐ కనకారావు వైసీపీ రౌడీలను తీసుకొచ్చి టిడిపి ఆఫీసుపై దాడి చేయించి, తనపై టిడిపి నేతలు దాడి చేశారని రివర్స్ కేసు పెట్టిన అరాచకంపై టిడిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కూడా అనపర్తి సీఐ శ్రీనివాస్ చేసిన రౌడీ యిజం ఏపీలో పోలీసు గూండాగిరీకి పరాకాష్ట. చంద్రబాబు కదలకుండా పోలీసులను ఆయన కాన్వాయ్కి ఎదురుగా బైఠాయింపజేసిన సీఐ శ్రీనివాస్..టిడిపి నేతలని చితకబాదారు. ఓ రైతుని కొట్టి ట్రాక్టర్ తాళం లాగేసుకుని రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్ని పెట్టించిన సీఐ శ్రీనివాస్ తీరు చూసి ఇంతగా బరితెగించిన పోలీసులు అధికారులను దేశంలో ఎక్కడా చూడలేదని నేతలు విస్తుపోతున్నారు. అయితే ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమవుద్దనే ఆలోచన లేకుండా చట్టాలను ఉల్లంఘిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నది, వైసీపీ టికెట్ల కోసమేనని ఆరోపణలు వస్తున్నాయి.
గన్నవరం, కదిరి, అనపర్తి... ఇక్కడ సిఐలు మాత్రమే ఓవర్ ఆక్షన్ చేయటం వెనుక ఇంత కధ ఉందా ?
Advertisements