వైసీపీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిగ్రీ చదవలేదని, టిడిపి పదే పదే ఆరోపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్, కేసుల అఫిడవిట్లో రెండు రకాలుగా తన విద్యార్హతలు ఎందుకు పేర్కొన్నారో చెప్పాలని టిడిపి చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఒక చోట ఎంబీఏ అని రాసిన జగన్ ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీయో చెప్పాలంటూ ర్యాగింగ్ చేస్తున్నా ఇప్పటివరకూ వైసీపీ స్పందించలేదు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఓటు లేదనే వార్తతో జగన్ విద్యార్హతలపై మరోసారి దుమారం రేగుతోంది. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. టీచర్, స్థానిక, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిలకు నామినేషన్ల ఘట్టం జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉంది. అయితే ముఖ్యమంత్రికి ఓటు లేదు. పట్టభద్రుడు కాకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి ఓటరుగా నమోదు చేసుకోలేదని టిడిపి ఆరోపిస్తోంది. అసెంబ్లీలో తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని గొంతు చించుకునే జగన్ రెడ్డి అసలు డిగ్రీయే పూర్తి చేయలేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంటర్ వరకూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చెబుతున్నా..ఆ తరువాత జగన్ చదువుకి సంబంధించిన ఏ రికార్డులూ లేవని టిడిపి ఆరోపిస్తోంది. అసలు 'జగన్ డిగ్రీ పూర్తి చేశారా? చేస్తే ఓటరుగా ఎందుకు నమోదవలేదు?'అని ప్రశ్నిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, గ్రాడ్యుయేట్ ఓటరుగా ఎందుకు నమోదు చేయించుకోలేదని తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి ప్రశ్నించారు. జగన్ డిగ్రీ పూర్తిచేశారా? లేదా? పూర్తిచేసి ఉంటే పులివెందులలో ఎందుకు ఓటరుగా నమోదు చేసుకోలేదు? అని అడుగుతున్నారు. వైసీపీ నుంచి జగన్ రెడ్డికి పట్టభద్రుల ఓటు లేదనే టిడిపి ఆరోపణలపై కౌంటర్ ఇవ్వకపోవడంతో అనుమానాలు నిజమేననుకుంటున్నారు జనాలు.
జగన్ డిగ్రీ పాస్ అవ్వలేదా ? కీలక ఆధారాలు బయట పెట్టి, బాంబు పేల్చన టిడిపి
Advertisements