వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పెద్ద కష్టం వచ్చింది. మరదలి అల్లుడు నందమూరి తారకరత్న మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న సాయిరెడ్డికి వరస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తారకరత్న చంద్రబాబుకి మేనల్లుడు అయితే, సాయిరెడ్డికి అల్లుడు అవుతాడు. అప్పట్లో ఈ బంధుత్వాన్ని గురించి సాయిరెడ్డి చెబుతూ తనకి చంద్రబాబు అన్న అవుతాడని వెటకారంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ అన్న చంద్రబాబుని కలిసినందుకే సాయిరెడ్డిపై జగన్ రెడ్డి పీకల్లోతు కక్ష పెట్టుకున్నాడు. తన బిడ్డ అయ్యే అలేఖ్యరెడ్డికి వచ్చిన కష్టంలో చంద్రబాబు కుటుంబం అండగా నిలవడంతో విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు. దీంతోపాటు అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు పక్కనే కూర్చున్న సాయిరెడ్డి ఆయనతో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. మరణ సందర్భం కావడం ఇరువురికి దగ్గర బంధువు కావడంతో అంతా విషాదంలో రాజకీయాలేంటి అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం సాయిరెడ్డిని క్షమించలేదు. ఇప్పటికే చాలా బాధ్యతలు పీకేసిన జగన్ తాజాగా పార్టీ పదవులు కూడా పీకేశాడు. తల్లి విజయమ్మని బలవంతంగా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి తరిమేసిన జగన్, అంతకుముందే చెల్లి షర్మిలని అన్నివిధాలుగా అన్యాయం చేసి దిక్కున్నకాడ చెప్పుకోమంటూ పంపేశాడు. ఇప్పుడు తనకి ఆత్మలా వెన్నంటి ఉండే సాయిరెడ్డిని కూడా చంద్రబాబుతో కలిశాడనే ఒకే ఒక కారణంతో పదవులన్నీ పీకేసి దూరం పెట్టారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బాధ్యతలు, సోషల్మీడియా ఇన్చార్జి, అనుబంధసంఘాల కన్వీనర్ పదవులన్నీ పోయిన సాయిరెడ్డి ఉత్తి రాజ్యసభ ఎంపీగా మిగిలిపోయారు.
విజయసాయిరెడ్డి చంద్రబాబుని కలిశాడని జగన్ ఇంత పని చేసారా ? అయ్యో విజయసాయి...
Advertisements