Sidebar

01
Thu, May

ఏపీలో వైసీపీ స‌ర్కారు ఏ సంక్షోభంలో ప‌డినా, రాజ‌ధానిలో ఏదో ఒక కేసుని తిర‌గ‌దోడుతుంది. కోర్టుల్లో కేసులున్నా, మ‌రికొన్ని చీవాట్లు తిన్నా ఈ రివ‌ర్స్ కేసుల ప్లాన్‌ని అమ‌లు చేస్తూనే ఉంది. వివేకా హ‌-త్య కేసు పూర్తిస్థాయిలో మెడ‌కు చుట్టుకోవ‌డంతో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌ద‌ని వార్త‌లొచ్చాయి. టిడిపి కీల‌క నేత నారాయ‌ణ ఇంటిపై దా-డు-ల‌-కి సీఐడీని పంపుతోంది. నారాయ‌ణ బెయిల్ పై ఉండ‌డంతో ఆయ‌న కుమార్తెల ఇళ్ల‌పై దా-డు-లు చేశారు. తాజాగా రాజధాని అమరావతి ప్రాంత మాస్ట‌ర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంలో అవకతవకలపై సీఐడీ నోటీసులు జారీ చేయ‌డం వెన‌క ఏదో ప్లాన్ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద మాజీ మంత్రి పి. నారాయణ, నారాయణ భార్య పి.రమాదేవి, పి. ప్రమీల, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది

Advertisements

Advertisements

Latest Articles

Most Read