విశాఖ ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురుచూస్తోన్న సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఏ ముహూర్తం కలిసి రావడంలేదు. తానొకటి తలిస్తే, సుప్రీంకోర్టు మరొకటి తలచింది. ఇల్లు చూసుకున్నానని, పోర్టు గెస్ట్ హౌస్ విడిది, రుషికొండ సీఎం ఆఫీసు అంటూ తన బులుగు మీడియాలో ప్రచారం చేసుకున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకడుగు ముందుకు వేసి ఏకంగా మార్చి 22న సీఎం విశాఖ వచ్చేస్తున్నారని ప్రకటించారు. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో కేసులు ఉండడంతో అవి త్వరగా తేల్చాలని ఏపీ సర్కారు న్యాయవాదులు కోరినా ఫలితంలేకుండా పోయింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ముందు ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాదులు త్వరగా విచారణ ముగించాలని కోరారు. స్పందించిన బెంచ్ మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతి పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేస్తూ సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు ఇవ్వడంతో వాయిదా పడింది. ఏకైక రాజధాని అమరావతే అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లింది ఏపీ సర్కారు. ఈ పిటిషన్ల పై విచారణ తేదీ కూడా ప్రకటించలేదు. అయితే వైసీపీ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న టీవీ9 అయితే విశాఖ రాజధానికి లైన్ క్లియర్ అంటూ సుప్రీంకోర్టు పేరుతో బ్రేకింగ్ కూడా వేసేసింది. ఈ నేపథ్యంలో విశాఖ తొందరగా షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనతో ఉన్న సీఎం వైఎస్ జగన్ తన న్యాయవాదులతో మార్చి 7 లోగా విచారణకొచ్చేలా చేయాలని కోరినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.మార్చి 28వ తేదీ విచారణ జాబితాలో ఉంచుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో విశాఖ రాజధానికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న సర్కారు ఆశలు అడియాసలయ్యాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాాలంటూ గత ఏడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ సర్కారు ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
జగన్ కు ఊహించని దెబ్బ కొట్టిన సుప్రీం కోర్ట్..
Advertisements