ఏపీలో చాలా శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. గన్నవరం ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖని మూసేయండి, లేదంటే వైసీపీలో విలీనం చేయండంటూ ఘాటుగా ట్వీటు చేశారు. చంద్రబాబు ఆవేదనలో అర్థం ఉంది. టిడిపి ఆఫీసు పోలీసుల సమక్షంలోనే వంశీ అనుచరులు తగలబెట్టేశారు. పోలీసులే టిడిపి ఆఫీసులో దొంగతనం చేశారు. చివరికి టిడిపి నేతలు తమపై దాడి చేశారంటూ పోలీసులే ఫిర్యాదులు చేసుకుని వారే అరెస్టు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఉన్నాయనేందుకు గన్నవరం ఘటనలే సాక్ష్యం అంటున్నారు. అయితే గన్నవరం ఘటనలో పట్టాభి, తెలుగుదేశం నేతలనే కాదు.. వారికి మద్దతుగా వెళ్లిన న్యాయవాదిపైనా అక్రమ కేసులు బనాయించేశారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తమ విధులకి ఆటంకం కలిగించారని, తమపైనే దాడులకు యత్నించారని పోలీసులే కేసులు బనాయించారు. దీనిపై విజయవాడ బార్ అసోసియేషన్ దగ్గర న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని, దీనికి నిరసనగా విధులు బహిష్కరించారు. లక్ష్మీనారాయణపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపిలో పోలీసుల వింత ప్రవర్తన.. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ?
Advertisements