అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్లాట్ల కోసం డబ్బులు కట్టి నానా పాట్లు పడుతున్న యజమానులకు హ్యాపీ న్యూస్ ఇది. సర్కారుకి అన్ని వ్యవస్థల్లాగే రెరా కూడా షాకిచ్చింది. డబ్బులు కట్టిన వారికి ప్లాట్లు అప్పగించడంలో సీఆర్డీఏ విఫలమైనందుకు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ స్తిరాస్థి వ్యాపార నియంత్రణ సంస్థ (రెరా) కీలక తీర్పు ఇచ్చింది. హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంతో తాము చెల్లించిన సొమ్ముకు వడ్డీ చెల్లించాలని డబ్బులు కట్టిన వారంతా రెరాను ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు రెరా ముందు జరిగాయి. హ్యాపీ నెస్ట్ ప్లాట్లు అప్పగించడంలో సీఆర్డీఏ విఫలమైందన్నారు పిటిషనర్ లాయర్. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కాలాన్ని ఏపీ రెరా పొడిగించిందని సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక లాయర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఆర్డీఏ కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసే పనిలో ఉందన్నారు. ఈ వాదనలు తోసిపుచ్చిన రెరా 2021 జూన్ 30 నుంచి ఫ్లాట్లను స్వాధీనపరిచేంత వరకు వడ్డీ సొమ్ము చెల్లించాలని.. పిటిషనర్లు చెల్లించిన డబ్బులపై 16.15శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరాతి ఏరియా నేలపాడులోని 14.46 ఎకరాల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుని ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యాధునిక వసతులతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ప్లాట్ల కోసం మంచి ఆదరణ లభించింది. ఈ ప్రాజెక్టులో జీ+18 విధానంలో మొత్తం 12టవర్లు నిర్మించాలని భావించింది. ఈ 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు కాగా.. హ్యాపీనెస్ట్ వ్యయం రూ.788.53 కోట్లు. ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు అమరావతి రాజధాని పనులతోపాటు హ్యాపీ నెస్ట్ నిర్మాణాన్ని కూడా మూలనపడేసింది. పొంతన లేని వివరణలు ఇస్తూ ప్రభుత్వం కాలం గడిపేస్తుండడంతో కొనుగోలుదారులు రెరాని ఆశ్రయించారు.
అమరావతి హ్యాపీ నెస్ట్ విషయంలో, జగన్ కు పడింది అతి పెద్ద దెబ్బ... అమరావతి జోలికి వస్తే అంతే మరి...
Advertisements