వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ దాఖలు చేసిన మరో బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. గతంలోనూ వేసిన పిటిషన్లు కొట్టేసిన కోర్టు, ఈ సారి సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. సునీల్ కి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుటుంబసభ్యులు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హ-త్య కేసును సీబీఐ విచారిస్తున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసిందిద. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, నిష్పాక్షిక దర్యాప్తు ముఖ్యమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. హ-త్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. వివేకా హ-త్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని కోర్టుకి విన్నవించింది. హ-త్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. వివేకా నందరెడ్డి హ-త్యకేసులో సీబీఐ చెబుతున్న పెద్దతలకాయలు ఎవరో తెలుగు రాష్ట్రాలలో సామాన్య ప్రజలకీ కూడా తెలిసిపోయింది. వివేకా హ-త్య కేసు విచారణలో భాగంగా ఇప్పటికే రెండుసార్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ పిలిపించింది. అవినాశ్‌రెడ్డికి ఏమీ తెలియదని, ఆయన తన తమ్ముడని, చాలా అమాయకుడని సీఎం వైఎస్ జగన్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వడమే ఆ పెద్దతలకాయలపై అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి.
వివేకా కేసులో ట్విస్ట్ అదిరింది.. పెద్ద తలకాయల పై హైకోర్టు వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ వైసీపీ
Advertisements