వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గం చంద్రగిరిలో అడుగిడిన నారా లోకేష్ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డిని టార్గెట్ చేశారు. ఎటువంటి మొహమాటాల్లేకుండా బ్యాటింగ్ చేశారు. అట, ఇట అంటూ శషభిషలు లేకుండా చెవిరెడ్డి, ఆయన తమ్ముడి అవినీతిపై ధ్వజమెత్తారు. తొండవాడ బహిరంగసభలో నారా లోకేష్ మాట్లాడుతూ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా ఈ నియోజకవర్గంలో చెలరేగిపోతోందన్నారు. చంద్రగిరిలో మూడు సీ లు ఉన్నాయని, అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు అంటూ సైటైర్లు పేల్చారు. చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడన్నారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జనం ఓట్లతో గెలిచిన చెవిరెడ్డి వెయ్యి రూపాయలు దోచుకుని...జనం చేతిలో రూ.10 పెడుతున్నాడన్నారు. చెవిరెడ్డి, ఆయన అనుచరులు ఎర్రచందనంతో వెయ్యికోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చెవిరెడ్డి తమ్ముడు రఘ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నాడని, రఘుకి చీటీల ఎమ్మెల్యే అనే పేరుందని, రూ.120కోట్ల విలువగల 60ఎకరాల భూమిని దోచుకున్నాడని ఆరోపించారు. చెరువుల భూములు కబ్జా చేసి, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా కూడా చెవిరెడ్డి తమ్ముడిదేనని సభలోనే ప్రకటించారు. ఎర్రచందనం ఎక్కడున్నా ఎత్తుకుపోయేది చెవిరెడ్డి మనుషులేనని లోకేష్ ఆరోపించారు.
చంద్రగిరి నుంచి వెళ్తూ వెళ్తూ, చెవిరెడ్డి రాజకీయం పై కోలుకోలేని దెబ్బ కొట్టిన లోకేష్.
Advertisements