తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అనపర్తిలో చేసిన పర్యటన, ఎంత ఉద్రిక్తతల మధ్య జరిగిందో చూసాం. చంద్రబాబు అనపర్తి సభకు, ముందు అనుమతి ఇచ్చి, తరువాత నిరాకరించటంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నాం అని, మీ మాట వినేది లేదు అంటూ, నడుచుకుంటూ అనపర్తి వచ్చి, సభలో ప్రసంగించారు. ఈ నేపధ్యంలోనే, పోలీసులు ఈ రోజు చంద్రబాబుతో పాటుగా, మరో ఏడుగురు పైన కేసు నమోదు చేసారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని,  బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు పైన కేసు నమోదు చేసారు. సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ వర్గాలు చెప్పాయి.  డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపైన కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు.  నిబంధనలకు విరుద్దంగా సభ నిర్విహించారని, అలాగే పోలీసుల పై చంద్రబాబు దూషణలకు దిగారని డీఎస్పీ ఫిర్యాదు చేసారు. దీని పై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పై కోర్టులోనే తేల్చుకుంటాం అని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read