ఫేమ‌స్ యాంకర్ ఝాన్సీ మాజీ భ‌ర్త జోగినాయుడు తెలుసు క‌దా. అంటే సినిమాల్లో జోగిబ్ర‌ద‌ర్స్ పేరుతో పేరు తెచ్చుకున్న న‌టుల్లో ఒక‌రైన జోగినాయుడు వైసీపీకి చేసిన సేవ‌ల‌కు ప్రతిఫలంగా ఓ కొత్త ప‌ద‌విని క్రియేట్ చేసి మ‌రీ క‌ట్ట‌బెట్టారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  అదే ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్  క్రియేటివ్ హెడ్ పోస్టు. తాగుడు, వ్య‌స‌నాల‌తో జోగినాయుడు వేధింపులు తాళ‌లేక ఝాన్సీ విడాకులు ఇచ్చేసింది. ఆ త‌రువాత డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పూరి జ‌గ‌న్నాధ్ పంచ‌న చేరాడు. పూరి సోద‌రుడు న‌ర్సీప‌ట్నం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేయ‌డంతో ఆయ‌న‌తోపాటు వైసీపీలో చేరాడు.  టీవీ ఆర్టిస్టు జోగినాయుడు త‌న కెరీర్ మొద‌లు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు సంపాదించాడు. అప్ప‌ట్లో ఝాన్సీ కూడా బుల్లితెర‌పై రాణించింది. ఈ స‌మ‌యంలో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. అనంత‌ర కాలంలో ఝాన్సీ సంపాద‌న‌పై ఆధార‌ప‌డి జోగినాయుడు వ్య‌స‌నాలకు బానిసై ఆమెపై దాడి కూడా చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో జోగినాయుడికి విడాకులిచ్చేసింది ఝాన్సీ. వైసీపీలో చేరిన త‌రువాత న‌ర్సీప‌ట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మాఫియాకి అండ‌దండ‌లు అందించ‌డం, రంగురాళ్ల ముఠాల‌తో లావాదేవీలు జోగినాయుడు న‌డుపుతున్నార‌నే ఆరోప‌ణ‌లు తెలుగుదేశం క్యాంప్ నుంచి వ‌చ్చాయి. దీనికి ఊతం ఇచ్చేలా భ‌మిడిక‌లొద్ది రిజ‌ర్వ్ ఫారెస్టులో బాక్సైట్ త‌వ్వ‌కాలు ప‌రిశీలించేందుకు ఎన్జీటీ టీము వ‌స్తే వారిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌లం అయిన జోగినాయుడు, అక్క‌డ త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌డంలేద‌ని పెయిడ్ ఆర్టిస్టుల‌తో క‌మిటీకి చెప్పించార‌ని ప్ర‌చారం ఉంది. మొత్తానికి ఏజెన్సీలో గ‌నుల మాఫియాకి అండ‌గా నిలుస్తూ వ‌చ్చిన క్రియేటివ్ జోగినాయుడుని  ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్  క్రియేటివ్ హెడ్‌గా నియ‌మించ‌డం జ‌గ‌న్ కే చెల్లింద‌ని టిడిపి ఎద్దేవ చేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read