తెలంగాణ ముఖ్య‌మంత్రి ఉడ‌త ఊపుల‌కు కేంద్రం బెద‌ర‌లేదు. ఎమ్మెల్యేల బేరం పేరుతో పెట్టిన కేసులూ తేలిపోయాయి. కేంద్రంలో బీజేపీ విసిరిన లిక్క‌ర్ స్కామ్ ఉచ్చు  కవిత మెడ‌కి మరింతగా గ‌ట్టిగి బిగిసింది. ఇతరులతో కలిసి కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నట్లు ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. క‌వితని అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో నిందితులపై ఈడీ చేసిన ఆరోపణలకూ ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయ‌న త‌న‌యుడు రాఘవ రెడ్డి క‌లిసి లిక్క‌ర్ స్కామ్‌ని  న‌డిపిన‌ట్లు ఆధారాల‌ను కోర్టుకి స‌మ‌ర్పించారు. ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పిన మాగుంట రాఘ‌వ‌రెడ్డి విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసిన వారు క‌విత‌నీ అరెస్టు చేస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉందని, డ‌బ్బు త‌ర‌లిన  వ్యవహారాలు తేలాల్సి ఉందని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో మ‌నీల్యాండ‌రింగ్‌ వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిలు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో  నిందితులైన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ లు బెయిలు కోసం చేసిన అభ్యర్థనలపై విచారణ జరిపిన కోర్టు నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read