న్యాయవ్యవస్థలో వెసులుబాట్లను వాడుకుని ఏళ్లుగా తనపై నమోదైన సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్ కేసులు విచారణకి రాకుండా చూస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ బెంచ్ హంటింగ్‌కి జగన్ గ్యాంగ్ పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంటే తమకు అనుకూలమైన జడ్జి వద్దకే కేసు విచారణ వచ్చేలా చేసుకున్నారని ఓ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు జగన్ బండారాన్ని ఆధారాలతో బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో భారతీ సిమెంట్స్ కేసు విచారణకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారతీ సిమెంట్స్ కేసును 16వ నెంబర్ కేసుగా జాబితాలో రిజిస్ట్రీ పేర్కొన్నారు. 15వ నెంబర్ కేసును విచారించిన తర్వాత నేరుగా 17వ నెంబర్ కేసును ధర్మాసనం విచారించిందిద. అంటే బెంట్ హంటింగ్ ఆరోపణలు వచ్చిన భారతీ సిమెంట్స్ కేసు విచారణకి రాలేదని తేలిపోయింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను అప్పట్లో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‍మెంట్‍కు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ కేసుని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ ధర్మాసనం ముందుకు విచారణకి వచ్చేలా జగన్ రెడ్డి మనుషులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ధర్మాసనం విచారణ జాబితా నుంచి చివరి నిమిషంలో డిలీట్ అయినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు ఏపీ సీఎం. ఆ నిరంజన్ రెడ్డి బంధువు పనిచేసే జడ్జి బెంచ్‌కి కేసు వెళ్లేలా చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ బయట పెట్టారు. సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్ విషయంలో జగన్ రెడ్డి ప్రకటన చేయాలని టిడిపి డిమాండ్ చేసింది. భారతి సిమెంట్స్ ఆస్తుల జప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో జరగబోయే కేసు విచారణలో బెంచ్ హంటింగ్ జరిగిందని, అవినీతి మార్గంలో తనపై కేసులు మాఫీ చేయించుకోవడానికి తెలంగాణకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్‌లో ఎంపీ నిరంజన్ రెడ్డి బంధువు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుందని, దీనిపై సీఎం జగన్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టులో బెంచ్ హంటింగ్ బెడిసికొట్టిందా? విచారణకి రాని భారతీ సిమెంట్స్ కేసు
Advertisements