ఆర్థిక‌శాఖా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పే ఏ విష‌య‌మైనా బుడ‌గ‌ల్లా పేలుతుంది. బుర్ర‌క‌థ‌లా కామెడీ అయిపోతుంది. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఒక్క‌చోట ఒక‌లా చేసి తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించారు. బెంగ‌ళూరులో ఒకే ఒక రాజ‌ధాని, అదీ విశాఖ అంటూ బ‌ల్ల‌గుద్దిన బుగ్గ‌న‌..చెన్నై వ‌చ్చేస‌రికి ఏపీకి మూడు రాజ‌ధానులు అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. బెంగ‌ళూరులో ఒకే రాజ‌ధాని విశాఖ అని తాడేప‌ల్లి పెద్దల మ‌నోభీష్టాన్ని ప్ర‌క‌టించిన బుగ్గ‌నకి కోర్టు కేసుల్లో ప‌డేశాడ‌ని ఆగ్ర‌హంగా ఉన్నారు వైసీపీ పెద్ద‌లు. మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల పేరుతో ఆడిన డ్రామాలు బుగ్గ‌న బుర్ర‌క‌థ‌ల‌తో బ‌య‌ట‌ప‌డిపోయి వైసీపీ రంగు వెలిసిపోయింద‌ని పెద్ద‌లు త‌లంటార‌ని స‌మాచారం. దీంతో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెన్నై వెళ్లిన ఆర్థిక మంత్రి ఇక్క‌డ మూడు రాజ‌ధానుల పాట అందుకున్నారు. అంత‌కుముందు  బెంగళూరు వెళ్లిన బుగ్గన విశాఖే రాజధాని అని ప్ర‌క‌టించి వైసీపీ స‌ర్కారునే ఇరుకున ప‌డేశారు. బుగ్గ‌న దెబ్బ‌కి స‌ల‌హాదారుడు  సజ్జల, మంత్రులు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ విధానం ఇదంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.  తాను వైసీపీకి చేసిన డ్యామేజ్ తానే క‌వ‌ర్ చేయ‌డానికి చెన్నై స‌మావేశాన్ని వాడుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మూడు రాజధానులకోసం ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టుగానే, విశాఖ పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని వివ‌రించారు. అయితే చెన్నై స‌భ‌ని లైవ్ ఇవ్వ‌కుండా ఆపేయ‌డం కొస‌మెరుపు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read