క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు. అంత‌కుముందు క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కుడు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన నేత‌. కాంగ్రెస్ వ‌ల్ల రాష్ట్ర విభ‌జ‌నలో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు వెలిబుచ్చిన ఆగ్ర‌హంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్ నేత‌లు త‌లో పార్టీలోకి పోయారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో చేరి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడయ్యారు. బీజేపీ కాపుల‌ను దువ్వి ఏపీలో త‌మ ఉనికి చాటుకోవాల‌నుకునే వ్యూహంలో క‌న్నాని చేర‌దీసింది. అయితే బీజేపీ స్టాండ్ ఏంటంటే, వైసీపీ భుజాల‌పై తుపాకీ పెట్టి టిడిపిని కాల్చేయ‌డం. ఇది సాధ్యం కాలేదు. రోజు రోజుకీ త‌మ అభిమాన వైసీపీ ప్రజాభిమానం కోల్పోతుండ‌డంతో బీజేపీ నుంచి మ‌ద్ద‌తు కోసం వైసీపీ సానుభూతిప‌రులైన సోమువీర్రాజుని అధ్య‌క్షుడిని చేసి,క‌న్నాని సాగ‌నంపింది బీజేపీ. అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌డెన్‌గా బీజేపీకి రిజైన్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే ఎటువంటి ఊగిస‌లాట లేకుండా టిడిపిలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించారు. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేలో చేర‌తార‌ని అంద‌రూ ఊహించారు. దీనికి భిన్నంగా టిడిపిలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌న‌సేన బీజేపీతో వెళితే..మ‌ళ్లీ అదే వైసీపీ సానుభూతిప‌రుల కోట‌రీ కింద ప‌నిచేయాల్సి వ‌స్తుంద‌ని, అలాగే ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చేది టిడిపియేన‌ని ఫిక్స్ అయిన క‌న్నా తెలుగుదేశం గూటికి చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read