కుప్పం నియోజకవర్గంలోనూ గెలిచేస్తాం. 175 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యమంటోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాలి తీసేసింది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. గతంలో ఇదే సంస్థ చేసిన సర్వేలో ప్రజాదరణలో నెంబర్ వన్ అంటూ ఊదరగొట్టుకున్నారు వైసీపీ వాళ్లు. లేటెస్ట్ సర్వేతో ఒక్కసారి అగ్రస్థానం నుంచి అథఃపాతాళానికి పడిపోయారు ఏపీ సీఎం. జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ అమాంతం తగ్గిపోయిందని సర్వే వెల్లడిస్తోంది. ఆరు నెలల్లో జగన్కు 20 శాతం ప్రజాదరణ తగ్గడం ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత స్పష్టం అవుతోంది. మూడేళ్లు పూర్తయ్యేసరికే జగన్ అంటే జనానికి మొహం మొత్తేయడంతో వైసీపీ కేడర్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆరు నెలల క్రితం ఇండియాటుడే సీ ఓటర్ సర్వేలో 56.5 శాతంగా ఉన్న జగన్ పాపులారిటీ సూపర్ స్పీడుతో తగ్గి 39.7 శాతంకి పడిపోయింది. బాగా పేరు సంపాదించిన మొదటి పది మంది ముఖ్యమంత్రులలో పదో స్థానంలో నిలిచిన జగన్ లాస్ట్ ప్లేసుతో సరిపెట్టుకున్నారు. పాలనలో పారదర్శకత లేకపోవడం, అరాచకాలు, విధ్వంసాలు, అవినీతి, అభివృద్ధి లేకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో అన్నివర్గాలు జగన్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వైసీపీకి షాకిచ్చిన ఇండియా టుడే సర్వే .. ఉలిక్కిపడ్డ వైసీపీ...
Advertisements