ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అన్నీ ఎదురుదెబ్బ‌లే. అయినా కేంద్రంలో పెద్ద‌ల ఆశీస్సుల‌తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ అండాదండ అందిస్తూ, కేంద్రంతో లాబీయింగ్ కి స్నేహ‌హ‌స్తం అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ అదానీ చీటి హిండెన్ బ‌ర్గ్ నివేదిక చింపేసింది. ఒక్క దెబ్బ‌కి ప్ర‌పంచ కుబేరుల్లో నెంబ‌ర్ వ‌న్ అయిన అదానీ ఏడ‌వ స్థానానికి ప‌డిపోయాడు. షేర్ మార్కెట్ కుప్ప‌కూలిపోయింది. ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌ర్ల సంప‌ద ఆవిరైపోయింది. అదానీ ప‌త‌నంతో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బ్యాడ్ టైమ్ స్టార్ట‌య్యింది. ఏపీలో పోర్టులు, భూములు, ఎయిర్ పోర్టుల‌న్నీ కారుచౌక‌గా అదానీకి క‌ట్ట‌బెట్టేస్తున్న ఏపీ స‌ర్కారు ప్ర‌తిఫ‌లంగా కేంద్రంతో లాబీయింగ్ కోసం అదానీని వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఏపీలో వ‌న‌రుల‌న్నీ అదానీ క‌ట్ట‌బెట్ట‌డం, కేంద్రంలో ఏపీకి కావాల్సిన‌వ‌న్నీ అదానీ అందించ‌డం క్విడ్ ప్రోకో న‌డిచిందని టిడిపి అనేక సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టింది. ఏ అదానీ అండ చూసుకుని వైసీపీ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుందో ఆ అదానీ సామ్రాజ్య‌మే కుప్ప‌కూలిపోయింది. అదానీనే ఇప్పుడు ఎవ‌రో ఒక‌రు ఆదుకోవాలి. ఈ దుస్థితిలో కేంద్రం వ‌ద్ద ప‌నులు చేసే పెట్టేందుకు జ‌గ‌న్ కి మ‌రో గాడ్ ఫాద‌ర్ అవ‌స‌రం ప‌డింది. రిల‌య‌న్స్ వాళ్ల‌కి రాజ్య‌స‌భ ఇచ్చాడు కాబ‌ట్టి, ఇక అటువైపు నుంచి సిఫార‌సుల‌తో కేంద్రంతో బేరాలు న‌డ‌ప‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read