ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా ఏడో అభ్యర్థిని రంగంలోకి దింపింది వైసీపీ. టిడిపి కూడా తమ 23 మందిలో నలుగురు అమ్ముడుపోవడంతో గెలిచే అవకాశాలు లేవని కామ్ గా ఉంది. హఠాత్తుగా వైసీపీలో అసమ్మతి స్వరాలు లేస్తుండడంతో వ్యూహం మార్చి పంచుమర్తి అనూరాధని రంగంలోకి దింపింది. దీంతో వైసీపీలో వణుకు ప్రారంభమైంది. క్యాంపులు, బిల్లులు రిలీజ్, సీఎం సముదాయింపులు జరిగాయి. అయినా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి ఓటేశారు. మొదట ఇద్దరే అనుకున్నారు. ఒకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కాగా, మరొకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని లీకులిచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు ఎలాగూ వైసీపీ వేయరని ఫిక్స్ అయ్యారు. టిడిపి నుంచి ఓట్లు వస్తాయనుకుంటే తమ నుంచే నలుగురి ఓట్లు లాగేయడంతో వైసీపీలో అనుమానపు చూపులు తీవ్రం అయ్యాయి. కనిగిరి బుర్రా మధుసూదన్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పైనే వైసీపీ డౌట్ వ్యక్తం చేస్తోంది.
వైసీపీకి కోడికత్తిలా గుచ్చిన ఆ నలుగురు ఎవరు?
Advertisements