మంత్రివర్గం మళ్లీ విస్తరిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ సారి కొందరు కొత్త మంత్రుల్ని బయటకి పంపుతారని టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో పర్యాటకశాఖా మంత్రి రోజా గత కొద్దిరోజుల వరకూ లేదు. అయితే ఇటీవలే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నగరి నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా రోజాని టార్గెట్ చేసుకుని వైసీపీ సర్కారుని డ్యామేజ్ చేసేలా చాలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ అవినీతి ఆరోపణలు గుప్పించారు. అయితే లోకేష్‌కి పార్టీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తారని ఎదురుచూసిన మంత్రి రోజా, ఒక రోజు గడిచినా ఎవరూ స్పందించకపోవడంతో తానే లోకేష్ పై ఎదురుదా-డికి దిగింది. ఆ తరువాత కొడాలి నాని వంటి వారు వచ్చి సానుభూతి బూతులు గుప్పించి వెళ్లారు. అయితే నగరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా లోకేష్ టార్గెట్ చేసుకున్నాడని తెలిసినా రోజాకి మద్దతు దొరకకపోవడంతో వైసీపీలో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ రెడ్డి కంటే మంత్రివర్గంలో పవర్ ఫుల్ అని పేరుపడిన మంత్రి పెద్దిరెడ్డితో రోజాకి పడదు. అటు నుంచి మద్దతు లేదు. నియోజకవర్గంలోనూ వైసీపీలో ఉన్న మూడు గ్రూపులూ రోజాకి వ్యతిరేకమే. ఈ కారణాలతో లోకేష్ రేపిన మాటలు మంటలు సెగలు రోజాని చుట్టుముట్టాయి. ఆరోపణలకు సమాధానం ఇవ్వలేకపోయినా, కనీసం నియోజకవర్గంలో లోకేష్‌ని అడ్డుకుని నిరసన తెలిపేందుకు కూడా రోజాకి మనుషులు లేకపోయారా అనే కోణంలో అధిష్టానం సీరియస్‌గా ఉంది. మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే రోజాని బయటకి పంపడం ఖాయమని వైసీపీలో చర్చ నడుస్తోంది. లోకేష్ పాదయాత్రని అడ్డుకోలేకపోయిందనే కారణంతోనే రోజా మంత్రి పదవి పోయే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.
లోకేష్ పాదయాత్ర రోజా పదవికి ఎసరు తెచ్చిందా?
Advertisements