వైసీపీలో నెంబర్2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిని చాలా అవమానకరంగా వైసీపీ నుంచి సాగనంపుతున్నారు. విశాఖలో భూదందాల పేరుతో సాయిరెడ్డిని బద్నాం చేసింది వైసీపీ పెద్దలేనని తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అల్లుడి అన్న ఢిల్లీ లిక్కర్ స్కాములో బెయిల్ కూడా దొరకని స్థితిలో ఇరుక్కున్నాడు. పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లేకపోవడంతో సాయిరెడ్డి ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవిని పీకేశారు. జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. సోషల్మీడియా బాధ్యతలను సజ్జల తనయుడు భార్గవ్ రెడ్డి చేజిక్కించుకున్నారు. తాజాగా వైసీపీ అనుబంధ సంఘాల విభాగాల బాధ్యతలనీ సాయిరెడ్డికి చెప్పకుండానే లాక్కున్నారు. విజయసాయిరెడ్డికి ఆత్మీయుడైన చెవిరెడ్డివి అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించేశారు. తాజాగా జరిగిన అనుబంధ సంఘాల నియామకాలన్నీ చెవిరెడ్డి పేరుతో లేఖలు జారీ అయ్యాయి. దీంతో వైసీపీలో విజయసాయిరెడ్డిని సాగనంపే కుట్రలు పతాకస్థాయికి చేరాయని తెలుస్తోంది. సాక్షి2గా మారిపోయిన టీవీ9లో విజయసాయిరెడ్డి పని వైసీపీలో అయిపోయిందని పేద్ద స్టోరీ రన్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్టు రాకపోతే స్క్రోలింగ్ కూడా వేయని టీవీ9 సాయిరెడ్డిపై ఏకంగా అరగంట స్టోరీ కుమ్మేయడం, అందులో నేరుగా సాయిరెడ్డిని వైసీపీ నుంచి గెంటేస్తున్నారని డైరెక్ట్‌గా చెప్పడంతో ఇది వైసీపీ పెద్దల స్కెచ్ అని అర్థం అవుతోంది. ఒక్కో కీలక బాధ్యత నుంచి తప్పించుకుంటూ వస్తున్న వైసీపీ పెద్దలు, చివరికి విజయసాయిరెడ్డిపై కోవర్టు ముద్ర వేసి సాగనంపే పనిలో ఉన్నారని స్టోరీ ద్వారా చెప్పకనే చెప్పారు. తన మరదలి కూతురు భర్త అయిన తారకరత్న అంత్యక్రియలకు హాజరైన సాయిరెడ్డి చంద్రబాబుతో సాగించిన మంతనాలు, వైద్యం సందర్భంగా బాలకృష్ణని పొగడటం, ఇటీవల నారా లోకేష్ బర్త్ డేకి విషెస్ చెబుతూ ట్వీట్ వేయడం వంటి కారణాలు చూపుతూ వైసీపీ నుంచి తరిమేసే ఏర్పాటు చేస్తున్నారని టీవీ9 క్లారిటీ ఇచ్చేసింది. భార్య భారతి కోరిక మేరకే సాయిరెడ్డి జగన్ రెడ్డి దూరం పెట్టినా, అక్రమాస్తుల కేసులన్నీ ఇద్దరి మెడకీ చుట్టుకునే ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటీ విచారణకి వస్తున్న దశలో విజయసాయిరెడ్డిని వ్యూహాత్మకంగా పక్కనబెడుతున్నారా? నిజంగానే దూరం చేసుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది.
ఏ2 సాయిరెడ్డి బాబు వెంట పడింది అందుకేనా?
Advertisements