నిత్యమూ బూతులు, రోత ట్వీట్లు వేస్తూ సోషల్మీడియాలో `ఏ` సర్టిఫికెట్ పొందిన విజయసాయిరెడ్డికి ఏ కేటగిరిలో సంసద్ రత్న అవార్డు ఇచ్చారో అని ఏపీలో చర్చలు జోరందుకున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడైనా వైసీపీ మొత్తం ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేది సాయిరెడ్డే. ఏపీకి సంబంధించి కేంద్రం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా, కేంద్రానికి భేషరతు మద్దతు ప్రకటించడమే సాయిరెడ్డి అవార్డు వరించటానికి కారణమని వైసీపీ ఎంపీలే తమలో తాము జోకులేసుకుంటున్నారు. ఇప్పటికే లెక్కకు మించిన పదవులు పొందిన సాయిరెడ్డి, అవార్డులు కూడా వదలడంలేదని వైసీపీ ఎంపీలు లబోదిబోమంటున్నారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కీలక పాత్ర, ప్యానల్ స్పీకర్ వంటి పదవులన్నీ సాయిరెడ్డి ఖాతాలోనే ఉన్నాయి. తాజాగా సంసద్ రత్న (పార్లమెంటు రత్న)-2023 అవార్డుకి సాయిరెడ్డిని ఎంపిక చేశారు. పార్లమెంటులో ఉన్నా అన్ పార్లమెంటరీ భాష వాడటంలో సాయిరెడ్డిని మించిన వారు లేరు. దీంతోపాటు అక్రమాస్తుల కేసుల్లో జగన్ రెడ్డి ఏ1 అయితే సాయిరెడ్డి ఏ2. సాయిరెడ్డిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్యానల్ స్పీకర్‌గా అవకాశం కల్పించింది కేంద్రంలో బీజేపీ సర్కారు. కళంకిత చరిత్ర ఉన్నా అత్యున్నత పదవులైన ఎథిక్స్ కమిటీలోనూ సాయిరెడ్డిని తీసుకున్నారు. తాజాగా సంసద్ అవార్డు ప్రకటించడం బీజేపీ-వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అవార్డు అని విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయసాయిరెడ్డికి ఆ అవార్డ్ ఎందుకు ఇచ్చారో ? ఆయన ట్విట్టర్ చూసి ఇచ్చారా ?
Advertisements