యువగళం టూరులో లోకేష్ జోరు పెంచారు. విమర్శల హోరు తీవ్రం చేశారు. దీంతో హాట్ హాట్‌గా మారింది టూరు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పాదయాత్రలో పరామర్శలు, పలకరింపులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూనే స్పెషల్ ఫోకస్‌తో ముందుకెళుతున్నారు. కనిపించిన ప్రతీ అంశాన్ని ఫోటో దిగి మరీ సర్కారుకి ప్రశ్న రూపంలో సంధిస్తున్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం ముసిలిపేడులో ఈ వైన్ షాపు ముందు లోకేష్ సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఎన్నికల ముందు మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్ పదవిలోకి వచ్చిన వెంటనే తానే లిక్కర్ కింగ్ అవతారం ఎత్తారని,దశలవారీగా ప్రమాదకరమైన మద్యం అమ్మకాలు పెంచేస్తున్నారని ఆరోపించారు. పేరుకి ఇది ప్రభుత్వ మద్యం దుకాణం. ఇందులో అమ్మే సరుకు జగన్ ది. అమ్మేవాళ్లు వైసీపీ వాళ్లు. అమ్మిన సొమ్ము చేరేది తాడేపల్లి ప్యాలెస్‌కే అంటూ ఇదేనా మీరు చేసిన మద్యనిషేధం అంటూ ప్రశ్నించారు. ఏర్పేడు మండలం, మోదుగులపాలెం స్వర్ణముఖి నది లో లెవల్ కాజ్ వేని ఆయన పరిశీలించి అక్కడా కూడా ఓ సెల్ఫీ కొట్టిన లోకేష్ వైసీపీ ఇసుక మాఫియా సామాన్యులకు ఇసుక దొరకకుండా చేసిన విధానంతో భవననిర్మాణ రంగం ఆధారపడిన కూలీలకు పనిలేకుండా పోయిందని, అనుబంధం రంగాలన్నీ సంక్షోభంలో పడ్డాయని వివరించారు.వికృతమాల వద్ద తాను మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన టిసిఎల్ కంపెనీ ముందు సెల్ఫీ దిగిన లోకేష్ , టిసిఎల్ లో పనిచేస్తున్న యువతీ, యువకులతో మాట్లాడారు. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడానికి పడిన తన కష్టాన్ని వివరించారు. కంపెనీలు పక్క రాష్ట్రాలకి తరిమేసే జగన్ రెడ్డికి నిరుద్యోగుల సమస్య, రాష్ట్ర అభివృద్ధి పట్టవని విమర్శించారు. వైసీపీ గూండాలు 20 మంది దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ మీసం మెలేసి ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబునాయుడు ఒక చిటికేసి చెబితే చాలని వైసీపీ కార్యకర్తలని తరిమి తరిమి కొడతామన్నారు. ఈ రోజు టిడిపిపై దాడి చేస్తోన్న వారు ఎక్కడికి వెళ్లినా లాక్కొచ్చి డ్రాయర్లు విప్పి ఊరేగించి కొడతామని హెచ్చరించారు. ఎండ వేడి పెరిగినట్టే లోకేష్ విమర్శల వాడి పెరిగింది. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రపై వైసీపీ దాడుల ప్రయత్నాలు..పోలీసుల నిర్బంధంతో లోకేష్ కూడా తన స్పీడు పెంచి తగ్గేదేలే అంటున్నారు.
లోకేష్ చేసిన పనికి బిత్తరపోయిన వైసీపీ... అస్సలు ఊహించలేదు..
Advertisements