తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ్యూహంతో వైసీపీలో వ‌ణుకు పుట్టించారు. ఇప్ప‌టివ‌ర‌కూ టిడిపి నుంచి వ‌చ్చిన న‌లుగురు, జ‌న‌సేన నుంచి ఒక‌రిని 151లో క‌లిపి లెక్కేసుకుంటూ మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు ఏక‌గ్రీవం అని ఊహాల్లో తేలుతున్న వైసీపీ అధిష్టానానికి టిడిపి ఇచ్చిన ఝ‌ల‌క్ గ‌ట్టిగానే త‌గిలింది. తెలుగుదేశం ఆ ఒక్క స్థానం గెల‌వ‌డం కంటే ముఖ్యంగా టిడిపి నుంచి వెళ్లిన న‌లుగురికి ఓ హెచ్చ‌రిక సందేశం, అలాగే వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తుల‌ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థి వైపు తిప్పే వ్యూహం రెండూ వున్నాయంటున్నారు వ్యూహ‌క‌ర్త‌లు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు జ‌రిపిన వ్యూహ కమిటీ సమావేశంలో ఈ దిశ‌గా చ‌ర్చ‌లు సాగాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దింపే యోచనలో తెలుగుదేశం ఉంద‌ని ఫీల‌ర్ పంపారు. ఈనెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడింటికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మార్చి 13న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావ‌డంతో టిడిపి అభ్య‌ర్థిని దింపేందుకు అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 23 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం కాగా, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది అయినా వైసీపీతో వంశీ, కరణం బలరాం , మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ అంట‌కాగుతున్నారు. ఈ న‌లుగురు జంపింగ్ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేయడం ద్వారా దారి తెచ్చుకోవాల‌నుకుంటోంది. మ‌రోవైపు వైసీపీలో ఉన్న ఆనం, కోటంరెడ్డి వంటి అసంతృప్త ఎమ్మెల్యేలు ఓట్లు క‌లిసి వ‌స్తే టిడిపి అభ్య‌ర్థి గెలుపు ఖాయం కానుంది. ఈ నేప‌థ్యంలో మాజీ మేయ‌ర్, చేనేత క‌మ్యూనిటీకి చెందిన పంచుమ‌ర్తి అనూరాధ‌ని ఎమ్మెల్సీ అబ్య‌ర్థిగా దింపే యోచ‌న‌లో టిడిపి ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read